Sri Satya Remuneration: బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో కేవలం ఒకరిద్దరు మినహా, మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా ప్రేక్షకులకు పెద్దగా ముఖపరిచయం లేనోళ్ళు అనే చెప్పొచ్చు..ఆ కొద్దీ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు శ్రీ సత్య..ఈమె యూట్యూబ్ లో పలు సూపర్ హిట్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకుంది..ముఖ్యంగా ‘తొందరపడకు సుందరవదన’ అనే సూపర్ హిట్ షార్ట్ ఫిలిం ద్వారా ఈమెకి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

అంతే కాకుండా టీవీ సీరియల్స్ లో విలన్ గా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఈమె ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీ..సీరియల్స్ లో ఈమె ఒక్కరోజు కాల్ షీట్ విలువ 7 నుండి 10 వేల రూపాయిల వరుకు ఉంటుంది..అందుకే ఈమెకి బిగ్ బాస్ యాజమాన్యం కూడా భారీ రేంజ్ లో పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది..ఆ రెమ్యూనరేషన్ ఇప్పటి వరుకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ అందరి కంటే ఎక్కువట.
ఈమెకి ఒక్క రోజుకి 10 వేల రూపాయిల చొప్పున రెమ్యూనరేషన్ లెక్కగట్టారట బిగ్ బాస్ టీం..15 వారాల పాటు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది..అంటే 105 రోజులు అన్నమాట..ఈ 105 రోజులకు గాను ఆమెకి పది లక్షల రూపాయలకు పైగానే పారితోషికం ముట్టినట్టు తెలుస్తుంది.

ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న శ్రీ సత్య కి ఈ రేంజ్ పారితోషికం చాలా ఉపయోగపడింది అని చెప్పొచ్చు..తన తల్లి కి చికిత్స చేయించడం కోసం నాకు డబ్బులు చాలా అవసరం..డబ్బుల కోసమే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అంటూ ఆమె చాలా సార్లు బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది..ఆమె వచ్చిన లక్ష్యం నెరవేరినట్టే అని చెప్పొచ్చు..ఇక నుండి ఆమె కెరీర్ కూడా మరింత జోరుతో దూసుకెళ్లబోతుంది..సినిమాల్లో అవకాశాలు కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది..కాబట్టి శ్రీ సత్య కెరీర్ ఇక నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు.