Diabetes: ఇప్పుడు అందరిని భయపెడుతున్న మహమ్మారి మధుమేహం. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన చాలా మంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో మొత్తం మధుమేహుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని కబళిస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఆహారమే. విచ్చలవిడిగా ఏదిపడితే అది తింటూ షుగర్ బారిన పడుతున్నారు. జంకు ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ విపరీతంగా తీసుకోవడం వల్ల అనర్థాలు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒకసారి వచ్చిందంటే ఇది జీవితాంతం మనతోనే ఉంటుంది. మందులు వాడుతూ పోవాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యమే.

షుగర్ ను కంట్రోల్ ఉంచుకోకపోతే రక్తపోటు కూడా జత కలుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే మూత్రపిండాలు, గుండె, కళ్లు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతినే ప్రమాదముంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అంతటి ప్రమాదకరమైన చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఒకటే మార్గం. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. దానికి కొన్ని చిట్కాలు పాటించాలి. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల షుగర్ అదుపులోకి వస్తుంది.
అధిక కొవ్వు, ఉప్పు ఉండే ఆహారాలను తీసుకోవద్దు. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ పరీక్షలు చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఒత్తిడికి లోనుకావద్దు. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రతోనే మనకు ఒత్తిడి దూరం అవుతుంది. ఎక్కువగా దాహం, కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి.

షుగర్ లెవల్స్ పెరిగితే సరైన మందులు వాడాలి. ఎప్పటికప్పుడు షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. నిరంతరం వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇలా చిట్కాలు పాటిస్తే షుగర్ వల్ల మనకు ఏ ఇబ్బందులు రావు. ప్రమాదకరమైన జబ్బే అయినా దాన్ని అదుపులో ఉంచుకుంటే నష్టం ఉండదు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటే ఎలాంటి దుష్పలితాలు రావు. హాయిగా జీవనం కొనసాగించవచ్చు.