Pawan Kalyan Remuneration: చిరంజీవి నటవారసుడిగా పవన్ కళ్యాణ్ వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఇతర వారసుల్లా పవన్ ఎప్పుడూ అన్నయ్యను ఇమిటేట్ చేయలేదు. అలా చేసి ఉంటే ఆయన అతిపెద్ద స్టార్ అయ్యేవారు కాదు. తన ఓన్ స్టైల్, మేనరిజం తో యూత్ కి దగ్గరయ్యారు. వరుస హిట్స్ తో తిరుగులేని స్టార్డం సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హిందీ హిట్ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ రీమేక్. ఒరిజినల్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించారు.

తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో పవన్ కళ్యాణ్ సాహసాలు అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. చేతులపై కార్లు ఎక్కించుకోవడం, గుండెలపై బండరాళ్లు పగలగొట్టించుకోవడం వంటి సాహసాలు పవన్ రిస్క్ చేసి చేశారు. నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ ఈ చిత్ర హీరోయిన్ గా నటించడం మరో విశేషం. మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాకు అల్లు అరవింద్ తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చాడో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేవలం రూ. 5000 రూపాయలు పవన్ కళ్యాణ్ తన మొదటి చిత్ర పారితోషికంగా అందుకున్నారట. మరి ఇప్పుడు ఆయన మార్కెట్, స్టార్డం రీత్యా రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఆ లెక్కన ఇప్పటి పవన్ రెమ్యూనరేషన్ ఎన్ని రెట్లు పెరిగిందో ఊహించుకోవచ్చు. ఇక పాలిటిక్స్ కారణంగా పవన్ కళ్యాణ్ 2018 తర్వాత బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ కమ్ బ్యాక్ ప్రకటించిన ఆయన వరుసగా చిత్రాలు చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. తాజాగా ఆయన దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. దర్శకుడు సుజీత్ తో మరొక చిత్రం ప్రకటించారు. తమిళ చిత్రం వినోదయ సిత్తం రీమేక్ కి సైతం పవన్ సైన్ చేశారు.