Actress Kushboo: తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్ ఖుష్బూ..ముఖ్యంగా తమిళనాట ఈమెకి అప్పట్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అప్పటి యువత ఈమెకి తమిళనాడు ప్రాంతం మొత్తం దేవాలయాలు కూడా ఏర్పాటు చేసారు..అంతటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ ఈమె..ఇప్పటికీ కూడా ఆమె తెలుగు మరియు తమిళం బాషలలో బిజీ ఆర్టిస్టు గానే కొనసాగుతున్నారు.

తెలుగు లో ఈమె ఈ ఏడాది శర్వానంద్ హీరో గా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటించింది..అంతకుముందు ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది..కేవలం సినిమాలు మాత్రమే కాదు..బుల్లితెర మీద కూడా ఈమె పలు సీరియల్స్ లో నటించింది..పలు షోస్ కి జడ్జీ గా కూడా వ్యవహరించింది..అందులో పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కూడా ఒకటి..ఎప్పుడూ నవ్వుటూ సరదాగా ఉండే ఖుష్బూ ఇప్పుడు శోకసంద్రం లో మునిగిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ గత కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచాడు..ఈ సందర్భంగా ‘చిన్నప్పటి నుండి ఆయనతో నేను ఎంతో సంతోషమైన కాలం ని గడిపాను..భవిష్యత్తులో కూడా అతనితో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను..కానీ ఇప్పుడు ఆయనకీ చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికే సమయం వస్తుందని అనుకోలేదు’ అంటూ సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది..చిన్నప్పటి నుండి ఖుష్భూ కి తన అన్నయ్యలతో మంచి సాన్నిహిత్యం ఉండేది.

అబ్దుల్లా ఖాన్ తో పాటు ఆమెకి అబూ బాకర్ మరియు అలీ అనే మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు..అబ్దుల్లా ఖాన్ కి అనారోగ్యం వచ్చినప్పటి నుండి ఖుష్బూ నే ఆయనకీ దగ్గరుండి తన సొంత ఖర్చులతో చికిత్స చేయిస్తూ వచ్చింది..కానీ చివరికి అతనిని కాపాడుకోలేకపోవడం తో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురైంది..అబ్దుల్లా ఖాన్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాము.