Old Hotel Bill: తలసరి ఆదాయంతో ధరలు ఈ రోజుల్లో పోటీ పడుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితం అలా అలా సాగిపోతోంది. గొప్పగా.. ఏమీ ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రెండు మూడు దశాబ్దాల కిందటి ధరలతో పోలుస్తూ.. పాత బిల్లులను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది 1969లో టిఫిన్స్‌కు సంబంధించిన బిల్లు. ఇప్పుడు టిఫన్ చేసినా ట్యాక్స్ జీఎస్టీ, సీజీఎస్టీ కట్టాల్సిందే. అప్పుడు ఎలాంటి ట్యాక్సులు లేకుండా ఉన్న ఈ బిల్లు చూసి, అప్పటి టిఫిన్ల ధరలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న ధరలు..
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, గ్యాస్, వంట నూనె ధరల కారణంగా తినే ఆహారం కూడా ఖరీదవుతోంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఆహారం కన్నా బయటి ఫుడ్‌ను ఇష్టంగా తినేవారు పెరుగుతున్నారు. దీంతో ధరలు కూడా అంతే రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో సంపాదించిన డబ్బులు నీళ్లలా ఖర్చవుతున్నాయి. ఇంటి ఆహారం ఒంటికి మంచిదని తెలిసి కూడా చాలా మంది బయటి ఫుడ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొందరేమే సమయం లేక బయటి ఆహారం తింటున్నారు. ఇలా అనేక కారణాలతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
నాటి ధరలు ఇలా..
ఇక ఇప్పుడు హోటళ్లలో రేట్లు మనలో చాలా మందికి తెలుసు. కానీ, 1965లో రేట్లు చాలా మందికి తెలియవు. అప్పట్లో కూడా నిత్యావసర ధరలు పెరగడంతో టిఫిన్ల ధరలు పెంచారట. దానికి సబంధించి రేపల్లెలోని హోటళ్ల యజమానులు ఓ పాంప్లెట ము6దించారు. ప్రస్తుతం ఆ పాంప్లెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 1965, నవంబర్ 1న ముద్రించిన ఈ పాంప్లెట్‌లో టిఫిన్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కూడా ధరల పెంపు తర్వాత రేట్లు. నాడు రెండు ఇడ్లీల ధర 15 పైసలు, ఉప్మా, అట్టు ధర కూడా 15 పైసలే ఒక ఇడ్లీ ధర 08 పైసలు, కారం, గారె కూడా 15 పైసలే. రవ్వ అట్టు మాత్రం 20 పైసలు. మసాలా గారె, బోండా ధర కూడా నాడు 20 పైసలు. ఇక కాఫీ, టీ ధరలు కూడా 15 పైసలు సగం కాఫీ, టీ ధర 12 పైసలు మాత్రమే. ఇవన్నీ పెంచిన ధరలు. పెంరక ముందు ఒకటి రెండ పైసాలు తక్కువగానే ఉండి ఉంటాయి.