Nita Ambani Phone
Nita Ambani Phone: డబ్బున్న వాళ్లు ఏం చేసినా ఆడంబరంగానే ఉంటుంది. తొడుక్కునే చెప్పుల దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్ని రిచ్ గానే ఉంటాయి. ఇక మన దేశంలో అంబానీ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “రిలయన్స్ జియో సెంటర్” నుంచి “ఆంటీలియా” వరకు ప్రతి ఒక్కటి ఊహకు మించి ఉంటాయి. అంబానీ కుటుంబం ఎలాంటి వేడుక చేసినా అంబరాన్ని తాకేలా ఉంటుంది. మొన్నటికి మొన్న నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కనీ విని ఎరుగని స్థాయిలో చేశారు. వేడుక విషయంలోనే అంత ఖర్చు పెడితే.. వారు వాడే ఉపకరణల కోసం ఇంకా ఎంత ఖర్చు పెడతారో ఊహించుకోవచ్చు. ఇక ఇటీవల ఒక ప్రైవేట్ పార్టీలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మెరిశారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న ఫోన్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాని ఖరీదు గురించి, అది ఎక్కడ తయారైంది? ఏ కంపెనీ రూపొందించింది అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.
ఫాల్కన్ సూపర్ నోవా
నీతా అంబానీ వాడే ఫోను అత్యంత ఖరీదైంది.. ఆ స్మార్ట్ ఫోన్ విలువ ఊహకు కూడా అందదు. “ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్” అనే రకాన్ని ఆమె ఉపయోగిస్తున్నారు. దీనికి ఎందుకు అంతటి విలువ అంటే ఈ స్మార్ట్ ఫోన్లో పొందుపరిచిన పింక్ డైమండే కారణం. ఇక ఈ ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు ( దాదాపు భారత కరెన్సీలో 395 కోట్లు). ఇక ఈ ఖరీదుతో ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేయవచ్చట. ఈ ఫోన్ ను చాలా ఏళ్ళ నుంచే నీతా అంబానీ వాడుతున్నారు..పైగా ఆమె ఎక్కడా కూడా బయటికి కనిపించేలా వాడ లేదు. దేశంలోనే అతిపెద్ద శ్రీమంతురాలు కావడం, ఆమె ఆ స్థాయిలో అత్యంత ఖరీదయిన ఫోన్ వాడటంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. కానీ ఆ ఫోన్ ఎందుకు ఖరీదైనదో తెలుసుకుంటేనే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.
అనుకూలించిన వెర్షన్
నీతా వాడే ఐఫోన్ 6 ను “ఫాల్కన్ సూపర్ నోవా”తో అనుకూలించారు. ఇదే ఐఫోన్ 6 2004లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. నీతా అంబానీ వాడే ఐఫోన్ 6 లో 24 క్యారెట్ బంగారాన్ని ఉపయోగించారు. దాంతోపాటు పెద్ద పింక్ డైమండ్ ను ఫోన్ వెనుక ప్యానెల్ లో బిగించారు. ఐ ఫోన్ లో ఎన్ని కొత్త వెర్షన్స్ వచ్చినప్పటికీ నీతా అంబానీ ఆ ఫోన్ నే ఉపయోగిస్తున్నారు. మొన్న జరిగిన ప్రైవేట్ పార్టీలో తప్ప ఇంతవరకు ఆమె తన ఫోన్ ను ఎక్కడా బహిరంగంగా కనిపించేలాగా ప్రవర్తించలేదు. అయితే మొన్న జరిగిన ప్రైవేట్ పార్టీలో ఆమె ఫోన్ కనిపించడం, సోషల్ మీడియాలో శోధన మొదలు కావడంతో దాని వివరాలు బహిర్గతమయ్యాయి. మొన్నటికి మొన్న ముకేశ్ అంబానీ తనకు నమ్మిన బంటు అయిన వ్యక్తి కోసం ₹1500 కోట్ల విలువచేసే అపార్ట్మెంట్ ను బహుమతిగా ఇచ్చాడు. తాజాగా నీతా అంబానీ ₹వందల కోట్లు విలువచేసే స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నట్టు ప్రపంచానికి తెలిసింది. ఎంతైనా డబ్బున్న వాళ్ళ అభిరుచే వేరు. వారు తమ వద్ద ఉన్న డబ్బుతో ఏదైనా చేయగలరు. ఏమైనా చేయగలరు. ధనం మూలం ఇదం కార్పొరేట్!