Ambani- Ratan Tata Daily Income: భారత వ్యాపార రంగంలో రతన్ టాటాది ఓ ప్రత్యేకమైన శైలి. ముఖేష్ అంబానీ రాకముందే టాటా వ్యాపారంలో దిట్ట కావడం తెలిసిందే. తనదైన శైలిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. రోజురోజుకు తన సంపాదన పెంచుకుంటున్నా ఆయన తీసుకుంటున్న వేతనం మాత్రం తక్కువే. నెలకు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తీసుకునేంత జీతం తీసుకోవడం ఆశ్చర్యకరమే. దేశంలో ఉప్పు నుంచి విమానం వరకు ఆయన చేయని వ్యాపారాలు లేవు. అన్నింట్లో కూడా తనదైన ముద్ర వేశారు. వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. రిటైల్ నుంచి హోల్ సేల్ వరకు అన్ని రంగాల్లో ఆయన మేటి అనిపించుకున్నారు.
గొప్ప వ్యాపార వేత్త అయిన టాటా వ్యాపారంలోనే కాదు సామాజిక సేవలో కూడా ముందే ఉంటారు. ఎంతో మంది అభాగ్యుల కోసం తన సంపాదనలో కొంత మొత్తాన్ని కేటాయించి సేవలు చేయడంలో ముందంజలో ఉంటారు. స్వచ్చంధ సంస్థ ద్వారా అనాథ పిల్లలు, వికలాంగులకు ప్రత్యేకంగా సాయం చేస్తున్నారు. రతన్ టాటా రోజువారీ ఆదాయం రూ. 18,739 లేదా 347 డాలర్లు. నెలకు ఆయన సంపాదన రూ.5.70 లక్షలు మాత్రమే. ఇది ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వేతనంగా చెప్పుకోవచ్చు.
Also Read: Pawan Kalyan- Chandrababu Meets Modi: మోదీ, బాబు కలయిక.. : పవన్ అదే కోరుకున్నాడా..?
ప్రతి గంటకు రూ.780గా ఉంది. దీంతో టాటా 2012లో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ బాధ్యతను నటరాజన్ చంద్రశేఖరన్ కు అప్పగించారు. ప్రస్తుతం ఓ సాధారణ వ్యక్తిగానే ఉన్నారు. టాటా సంవత్సరానికి రూ.68 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే రెండో సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ సంపాదన భారీగానే ఉంది. అంబానీ సంపాదన 94 బిలియన్లు ( ఏడు లక్షల కోట్లు). నిమిషానికి రూ.22 లక్షల కు పైగానే సంపాదిస్తున్నారు. ప్రతి గంటకు రూ.13.67 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
సంపాదన ఎంత ఉన్నా సంతృప్తి లేనిది కష్టమే. అది టాటా జీవితంలో కనిపిస్తుంది. ఉన్న దాంట్లోనే ఆయన సంతృప్తితో బతికారు. కానీ ప్రస్తుతం వ్యాపార వేత్తల్లో నిరంతరం సంపాదించాలనే యావ ఎక్కువవుతోంది. ఫలితంగా లక్షల కోట్లు సంపాదిస్తూ జీవితంలో ఆనందాన్ని మరిచిపోతున్నారు. ఫలితంగా డబ్బు కోసమే తమ బతుకు ఉందని దాని వెంటే పరుగు పెడుతున్నారు. ఇటీవల కాలంలో బదానీ సంపాదన అందరికంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
Also Read:Chandrababu Meets Modi: మోదీని కలవడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఇదేనా..?