Rajagopal Reddy: మునుగోడులో పోటీకి దూరంగా రాజగోపాల్ రెడ్డి?

Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికపై చాలా అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమవుతుందని అందరు ఓ అంచనాకు వచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. అసలు మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురవుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇక్కడ […]

Written By: Srinivas, Updated On : August 7, 2022 5:46 pm
Follow us on

Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికపై చాలా అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమవుతుందని అందరు ఓ అంచనాకు వచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. అసలు మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటు ఎదురవుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది.

Rajagopal Reddy

ఇక్కడ దాదాపు 2.20 లక్షల ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బీసీల ఓట్లు 1.40 లక్షలు ఉన్నట్లు తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికలో బీసీలకు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో అన్ని పార్టీలు బీసీలకు కేటాయిస్తే ఇక చేసేది ఏముంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీకి దూరంగా ఉండనున్నారా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే సీట్లు ఇవ్వడంతో ప్రస్తుతం బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. దీంతోనే రాజగోపాల్ రెడ్డి పోటీకి దూరం కావచ్చనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: KCR Declares New Pensions: 10 లక్షల పాచిక ముందస్తు కేనా

ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో మునుగోడు జ్వరం అందరిలో అంటుకుంది. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు వెళతారనే వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై ఆరాలు తీస్తున్నాయి. ముందస్తుకు వెళితే ఫలితం ఎలా ఉంటుంది? పోటీకి దిగితే ఏమవుతుంది? అనే కోణాల్లో అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భంగపాటు కలిగిన నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతోంది.

Rajagopal Reddy

టీఆర్ఎస్ నుంచి కర్నాటి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, వారబోయిన రవి, బూర నర్సయ్య గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పల్లె రవి, పున్న కైలాష్ నేత, చెరుకు సుధాకర్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తున్నా అన్ని పార్టీలు బీసీ నేతలను రంగంలో దింపితే బీజేపీ కూడా బీసీ నేత కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయో తెలియడం లేదు. మొత్తానికి రాజకీయ హైడ్రామా మాత్రం మునుగోడులో కీలకం కానుంది.

మునుగోడుపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని రంగంలోకి దింపుతుందా? లేక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ కేటాయిస్తుందా? అధికార పార్టీ టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్తుందా? లేక పోటీలో ఉంటుందా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పుడు మునుగోడు వ్యవహారం అందరి సహనానికి పరీక్ష పెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:Chandrababu Meets Modi: మోదీని కలవడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఇదేనా..?

Tags