Tarakaratna Treatment Cost: నారా లోకేష్ ఇటీవలే ‘యువ గళం’ పేరిట కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే..ఈ పాదయాత్ర లో టీడీపీ కార్యకర్తలతో పాటుగా నందమూరి కుటుంబీకులు కూడా పాల్గొన్నారు, వారిలో తారకరత్న కూడా ఒకరు.అయితే అకస్మాత్తుగా ఆయనకీ గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.తారకరత్న కి ఇలా జరగడం ఇదే తొలిసారి అట.ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయనకీ అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం.

ఆయనకీ గుండెపోటు రాగానే కుప్పం లోనే సమీప ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి శస్త్ర చికిత్స చేయించారు,కానీ ఆయన ఆరోగ్యం ఏ మాత్రం కుదుటపడకపొయ్యేసరికి వెంటనే ఆయనని బెంగళూరు లోని నారాయణ హృదయాలయ లో జాయిన్ చేసి అత్యవసర చికిత్స అందిస్తున్నారు..వారం నుండి ఆయనకీ ప్రత్యేక వైద్య బృందం ద్వారా చికిత్స కొనసాగుతూనే ఉంది కానీ, ఇప్పటి వరకు స్పృహ లోకి రాలేదు కానీ ప్రాణాపాయం ఏమి లేదని డాక్టర్లు చెప్పడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే తారకరత్న ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేనప్పటికీ ఆయన తొందరగా కోలుకునేందుకు విదేశాలకు తరలించబోతున్నట్టు సమాచారం..ఈ పర్యవేక్షణ మొత్తం బాలయ్య సారథ్యం లోనే కొనసాగుతుంది అట.తారకరత్న కి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటి నుండి బాలయ్య బాబు కంటి మీద కునుకు కూడా వెయ్యలేదు.ఆయన తన పనులన్నీ మానుకొని హాస్పిటల్ లోనే ఉంటున్నాడు..ఇప్పటికే తారకరత్న వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం,ఈ ఖర్చులన్నీ బాలయ్య మరియు లోకేష్ భరించారట..వారం రోజుల్లో కోటి రూపాయిలు అంటే రోజుకి 14 లక్షలు అన్నమాట.

తారకరత్న మీద నందమూరి కుటుంబీకులకు ఉన్న ప్రేమని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే తారకరత్న అంటే వీళ్ళందరికీ అంత ఇష్టం అనే విషయం అభిమానులకు తెలియదు.మీడియా కి ఎప్పుడూ దూరంగా ఉండే తారకరత్న గురించి, అతనికి నందమూరి కుటుంబం తో ఉన్న అనుబంధం గురించి చాలా తక్కువ మాత్రమే ఫ్యాన్స్ కి తెలుసు..ప్రస్తుతానికి అపస్మారక స్థితిలోనే ఉన్న తారకరత్న త్వరగా స్పృహలోకి రావాలని ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.