Vastu Tips: గతంలో బాత్ రూంలు ఇంటి బయట ఉండేవి. దీంతో మనకు సౌకర్యంగా ఉండేది. ప్రస్తుతం అటాచ్డ్ బాత్ రూంలు వచ్చాయి. ఇంట్లోనే టాయ్ లెట్, బాత్ రూం ఉండటంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా అందరు దానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వీటితో వాస్తు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మారుతున్న జీవనశైలితో ఇంట్లో అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అటాచ్డ్ బాత్ రూంలు నిర్మించుకుంటున్నారు. దీని వల్ల పలు ఇబ్బందులు ఏర్పడుతున్నా సౌకర్యంగా ఉంటుందనే వాదనలు చేస్తున్నారు. అటాచ్డ్ బాత్ రూం విషయంలో వాస్తు నియమాలు పాటించి తీరాల్సిందే.

అటాచ్డ్ బాత్ రూం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు పద్ధతులు పాటించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. వాస్తు నియమాలు పాటించకపోతే జీవితం అనేక ఒడిదుడుకులకు గురవుతుంది. అటాచ్డ్ టాయిలెట్ నిర్మాణంలో పొరపాట్లు, వాటి వినియోగంలో చేసే దోషాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది. డబ్బు వృథా అవుతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంా ఉంటే పేదరికం దరిచేరుతుంది. అటాచ్డ్ బాత్ రూం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి.
అటాచ్డ్ బాత్ రూంను శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్ రూం నీట్ గా ఉండకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మురికిగా ఉంటే మనల్ని పేదరికంలోకి నెడుతుంది. సరైన నిద్ర లేకుండా చేస్తుంది. అటాచ్డ్ బాత్ రూం ఉన్న వారు దాని తలుపులను ఎప్పుడు మూసి ఉంచాలి. తెరిచి ఉంచితే వాస్తుదోషం పట్టుకుంటుంది. పడకగదిలో పడుకునేటప్పుడు మన కాళ్లు బాత్ రూం వైపు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ బాత్ రూం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజమే.
అటాచ్డ్ బాత్ రూం లో ఎప్పుడు కూడా లోపల వస్తువులు పగిలిపోయినవి ఉండొద్దు. ట్యాపులు లీక్ కాకుండా చూసుకోవాలి. అలా ఉంటే ధననష్టం కలుగుతుంది. చెత్తాచెదారం ఉంటే మన జీవితంపై పెను ప్రభావం పడుతుంది. బాత్ రూంలో వాస్తు దోషాలు తొలగించుకునేందుకు చిన్న గిన్నెలో నిండా ఉప్పు పోసి ఆ ఉప్పును బాత్ రూంలో ఉంచాలి. ఇలా ప్రతి వారం ఆ ఉప్పును బయట పడేసి మళ్లీ కొత్త ఉప్పును మార్చాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

అటాచ్డ్ బాత్ రూంలో ఉపయోగించే కలర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగులు కాకుండా లేత రంగులను వాడుకుంటే మంచిది. బాత్ రూం గోడలపై స్కై బ్లూ, క్రీమ్, లేత ఊదా రంగులు వేస్తే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు, లేదా గోధుమ రంగులను వేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న వాస్తు చిట్కాలు ఉపయోగించుకుని వాస్తు దోషాలను దూరం చేసుకోవాలి. లేకపోతే జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక నష్టాలను నివారించుకోవడంలో వాస్తు నియమాలు ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం గ్రహించుకోవాలి.