Writer Padmabhushan Collections: ప్రముఖ కమెడియన్ సుహాస్ హీరో గా నటించిన ‘రైటర్ పద్మభూషణ్ ‘ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..విడుదలకి ముందు టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను అలరించింది..కాస్త విభిన్నమైన కథాంశం తో ఫన్ మరియు ఎమోషన్స్ ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్..అందుకే ఈ చిత్రం ఆడియన్స్ కి అంత బాగా కనెక్ట్ అయ్యింది.

కలర్ ఫోటో సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ ని అందుకున్న సుహాస్ కి హీరో గా చేసిన రెండవ సినిమా కూడా సక్సెస్ సాధించడం విశేషం..ఇక టాక్ బాగా రావడం తో నిన్న కలెక్షన్స్ అదిరిపోయాయి,ముఖ్యంగా ప్రధాన నగరాల్లో టాక్ ప్రభావం బాగా కనిపించింది..మ్యాట్నీస్ నుండి కలెక్షన్స్ బాగా పెరిగాయి.మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
నైజాం ప్రాంతం లో కొత్త రకంగా అనిపించే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనే విషయాన్నీ మనం చాలా సార్లు గమనించే ఉంటాము..రైటర్ పద్మభూషణ్ కి కూడా ఈ ప్రాంతం లో మంచి ఓపెనింగ్ దక్కింది..రోజు మొత్తం పూర్తి అయ్యేసరికి మల్టీప్లెక్సులు మరియు సింగల్ స్క్రీన్స్ కలిపి ఈ సినిమాకి 30 శాతం ఆక్యుపెన్సీ వచ్చినట్టు సమాచారం.

మొత్తం మీద కేవలం ఈ ప్రాంతం నుండే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందని, ఇక విజయవాడ లో 34 శాతం ,వైజాగ్ లో 26 శాతం , చెన్నై లో 58 శాతం , బెంగళూరు లో 24 శాతం మరియు కాకినాడ లో 42 శాతం ఆక్యుపెన్సీలను దక్కించున్న ఈ చిత్రానికి 2 రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఆరు కోట్ల రూపాయలకు జరిగింది..వీకెండ్ లోనే 70 శాతం కి పైగా రికవరీ చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.