https://oktelugu.com/

రాత్రిపూట ఈ హోటల్లో జరిగే 5 వింత రహస్యాలు తెలుసా?

ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయాక అందరూ వ్యాపారం కోసమో.. లేక పర్యటనలకో తీర్థయాత్రలతో వివిధ ప్రదేశాలు సందర్శిస్తుంటారు. ఇక బయటకు వెళ్లినప్పడు అందరూ హోటల్లలోనే దిగిపోతారు. మధ్యతరగతి, ఖరీదు హోటల్స్ అని తేడా లేకుండా ఈ మధ్య అన్నింట్లోనూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. హోటల్ సిబ్బంది కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా వినూత్నమైన గౌరవ మర్యాదలు చేస్తుంటాయి. అవన్నీ కస్టమర్లను ముగ్ధులను చేస్తుంటాయి. అయితే కొన్ని హోటల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. హోటల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2021 / 08:58 PM IST
    Follow us on

    ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయాక అందరూ వ్యాపారం కోసమో.. లేక పర్యటనలకో తీర్థయాత్రలతో వివిధ ప్రదేశాలు సందర్శిస్తుంటారు. ఇక బయటకు వెళ్లినప్పడు అందరూ హోటల్లలోనే దిగిపోతారు. మధ్యతరగతి, ఖరీదు హోటల్స్ అని తేడా లేకుండా ఈ మధ్య అన్నింట్లోనూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. హోటల్ సిబ్బంది కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా వినూత్నమైన గౌరవ మర్యాదలు చేస్తుంటాయి. అవన్నీ కస్టమర్లను ముగ్ధులను చేస్తుంటాయి. అయితే కొన్ని హోటల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది.

    హోటల్ సిబ్బంది సర్వీస్ పేరు చెప్పి ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలీదు.. నిజాలు తెలిస్తే మాత్రం ఆ హోటల్లోనే ఎవ్వరికీ దిగాలనిపించదు. హోటల్లో జరిగే అంతర్గత విషయాలను తాజాగా హోటల్ సిబ్బందే వెల్లడించి సంచలనం రేపారు. ‘విశ్వరప్’ అనే కొత్త యాప్ ద్వారా హోటల్ లో దిగే కస్టమర్ల ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు ప్లాన్ చేసినట్టు హోటల్ సిబ్బంది ఈ విషయాలను వెల్లడించాడు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా హోటల్లు, అందులోని సిబ్బంది చేష్టలపై ఓ సర్వే జరిగింది. అందులో వెల్లడించిన విషయాలు తెలిసి కస్టమర్లందరూ ఆశ్చర్యపోయారట..

    తాజాగా ఈ సర్వే  వెల్లడించిన ప్రకారం హోటల్ లో దిగిన కస్టమర్లు ఏదైనా ఖరీదైన ఆహారపదార్థాలను ఆర్డర్ ఇస్తే వాటిని తీసుకొచ్చే హోటల్ సిబ్బంది అందులో సగం వరకూ తినేస్తారట.. అంటే వారు తినగా మిగిలింది మనకు పెట్టి అంతే వచ్చిందని వారికి చెబుతారన్నమాట.. ఇక సంవత్సరానికోసారి మాత్రమే బెడ్ షీట్స్ మార్చే హోటల్స్ కూడా ఉన్నాయని సదురు సిబ్బంది వెల్లడించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. ఇక ఖాళీగా ఉన్న రూముల్లో హోటల్ సిబ్బంది లెక్కలేనన్ని సార్లు లైంగిక చర్యల్లో పాల్గొని రూంను కంపుకంపు చేస్తారట.. కస్టమర్లు వస్తే ఆ రూములనే ఇస్తారట..

    ఇక హోటల్స్ లో ఉండే  స్విమ్మింగ్ ఫూల్ లోని నీటిని సంవత్సరానికి ఒకసారి కూడా మార్చరట.. అందులోని నీరు శుద్ధిగా ఉండేందుకు కొన్ని రసాయనాలు కలిపి వాసన రాకుండా చేస్తారట.. అందుకే హోటల్ లోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్స్ లో ఈత కొట్టే విషయంలో మాత్రం జాగ్రత్త పడాలని సర్వే చెబుతోంది.

    ఇలాంటి ఎన్నో అసంబద్ధమైన పనులన్నీ చేసేసి హోటల్స్ ను అద్దెకు ఇస్తుంటారట యాజమన్యాలు.. అందుకే ఇక నుంచి ఎక్కడికైనా వెళ్తే హోటల్ రూంతోపాటు సిబ్బందిపైనా ఓ కన్నేయండి అని పలువురు వాదిస్తున్నారు.