Top 10 Wonders World: సమస్త జీవరాశులకు జీవనాధారం ఈ భూమి. ప్రకృతి ప్రసాదించిన దీనిపై ఎన్నోవిశేషాలు,వింతలు. కొన్నిమానవ సృష్టి కాగా..మరికొన్నిసహజంగా ఏర్పడి ఆకర్షిస్తున్నాయి. ఆయా ప్రదేశాల్లోని వాతావరణ పరిస్థితులు ఇతర కారణాల వల్ల కొన్ని అద్భుత కళా ఖండాలు వెలిశాయి. వీటిని కొందరు చరిత్ర కారులు కాపాడుతూ వస్తున్నారు. రానురాను ఇవి పర్యాటక ప్రదేశాలుగా విరజిల్లుతూ ప్రజలనుఆకర్షిస్తున్నాయి.ఇలాంటి వాటిలోప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కట్టడాల గురించితెలుసుకుందాం.
1. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా.. (ఈజిప్ట్)
ఈజిప్ట్ లోని చెరోప్స్ యొక్క గ్రేట్పిరమిడ్ ప్రపంచంలోనిఅత్యంత అద్భుత కట్టడంలో ఒకటి. 2584-2561 బీసీ లో పాలించిన ఫరాహ్ ఖప్లుు. ఈ గిజా పీఠభూమిపై తన సమాధి నిర్మాణంకోసం ఒక భారీ ప్రణాళికనుఅమలుచేశారు. దీనిని నిర్మించడానికి 13 హెక్టార్ల భూమిని కేటాయించుకున్నాడు. పూర్తిగా మానవ సహిత నిర్మాణమైన ఈ పిరమిడ్లో గ్యాలరీలు, లోపలి మందిరాలు, గదులు ఉన్నాయి. దీనిని 3800 సంవత్సరాల కిందటే నిర్మించినట్లుతెలుస్తోంది.
2. అజంతా గుహలు(ఇండియా) :
భారతదేశంలోని మహారాష్టంలోని ఔరంగాబాద్ జిల్లాలో అజంతా గుహలుకనిపిస్తాయి. సుమారు రెండో శతాబ్దంలో ఒకపెద్ద గుట్టను తొలిచి నిర్మించారు. విశ్వవ్యాప్తంగా బౌద్ధమత కళ యొక్క కళాఖండాలుగా రాక్, కట్ శిల్పాలు ఇందులోకనిపిస్తాయి. ఇవి పురాతన భారతీయ కళనుచూపిస్తాయి. అజంతా గుహలు పురాత మఠాలు, వివిధ బౌద్ధ సంప్రదాయాలకు చెందిన పూజా మందిరాలుగా పేర్కొంటారు.
3. చాకో కెన్యాన్(మెక్సికో):
చాకో కల్చర్ నేషనల్ హిస్టారికల్ పార్క్ అమెరికాలోని నైరుతి ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉటా, కొలరాడో, అరిజోనా, న్యూమెక్సికో రాష్ట్రాలు ఉన్నాయి. ఏడీ 900-1150 మధ్య చాకో కెన్యాన్ పూర్వీకుల ప్యూబ్లోన్స్ సంస్కృతికి ప్రధాన కేంద్రంగా ఉంది. చాకో వద్ద ఆర్కియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సాక్ష్యం ప్రతిపాదించబడింది. విశాలమైన కొలరాడో పీభూమిపైన పశ్చిమాన చుస్కా పర్వతాలు, ఉత్తరాన శాన్ జువాన్పర్వతాలు, తూర్పున శాన్ పెడ్రో పర్వతాలుఉన్నాయి.
4. హిమేజి కోట (జపాన్):
జపాన్ లోని హైగో ప్రిఫెక్ఛర్లో ఉన్న హిమేజీ నగరంలోని ఓ పెద్ద కొండపై జపనీస్కోట సముదాయం ఉంది. భూ స్వామయ్యకాలం నాటి అధునాతన రక్షణ వ్యవస్థలతో83 గదులతో దీనిని నిర్మించారు. కోట హకురో -జో లేదా షిరసాగి జో అనే ఎగిరిపోయే పక్షి ఆకారంలో ఉంటుంది. 1333లో అకామత్సు నోరిమురా హిమేయామా కొండపై దీనిని నిర్మించారు.
5. బాగో సిటీ (మయన్మార్):
మయన్మార్ దేశంలోని బాగో ను 573 సీఈ నుంచి 1152 సీఈ వరకు దీనిని నిర్మించినట్లుగా 15వ శతాబ్దపు బర్మీస్ అడ్మినిస్ట్రేటివ్ గ్రంథమైన జాబు కుంచాలో పేర్కోన్నారు. బాగోను భారతదేశానికి చెందని చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ ఆక్రమించుకున్నట్లు చరిత్ర తెలుపుతోంది. 14వ శతాబ్దంలో సోమ మాట్లాడే రాజ్యంలో ఈ ప్రాంతం అత్యధికంగా ఉన్నందున 139లో బిన్నియు బాగోను రాజధానిగా చేశారు.
6. న్యూ గ్రేంజ్ (ఐర్లాండ్):
ఐర్లాండ్ లోని కౌంటీ మీత్ లోని ఒక చరిత్ర స్మారక చిహ్నం. ఇది డ్రోగెడాకు పశ్చిమాన 8 కిలోమీటర్ల దూరంలో బోయిన్ నదికి ఎదురుగా ఉంది. 3200 బీసీ లో నియోలిథిక్ కాలంలో నిర్మించిన అసాధారణమైన గ్రాండ్ పాసెస్ సమాధి . ఇది స్టోన్ హెంజ్, ఈజిప్టియన్ పిరమిడ్ ల కంటే పురాతనమైనది.
7. మొహంజోదారో సింధ్ (పాకిస్తాన్):
మోహంజోదారో సింధ్ అనే కట్టడాన్ని పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లోని ఒక పురావస్తు ప్రదేశంలో 2500 బీసీఈ లో నిర్మించిన ఇది పురాతన సింధుల లోయ నాగరికత యొక్క అతిపెద్ద స్థావరం. కనీసం 40వేల మంది జనాభాతో మొహంజోదారో సుమారు 17900 బీసీఈ లో అభివృద్ధి చేశారు.
8. హగియా సోఫియా (టర్కీ):
టర్కీ దేశంలోని హగియా సోఫియా అనేది విశాలమైన మసీదు. ఇది ఇస్తాంబుల్ లో చారిత్రక ప్రదేశంగా పేర్కొనబడుతుంది. ఒకప్పుడు ఇది క్రైస్తవ చర్చిగా ఉండేది. ఈ భవనాన్ని తూర్పు రోమన్ సామ్రాజ్యం మూడుసార్లు నిర్మించింది. ప్రస్తతం హగియా సోఫియా మూడోది. ఇది 537 ఏడీ లో నిర్మించబడింది.
9. అంగ్ కార్ వాట్ (కంబోడియా):
అంగ్ కార్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయంగా పేర్కొంటార. 12వ శతాబ్దంలో సూర్మవర్మన్ 2 దీనిని నిర్మించారు. ఇది వైష్ణవాలయం, ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం కూడా.
10. పాంథియోన్ రోమ్(ఇటలీ):
పాంథియోన్ అనేది రోమన్ పూరాతన దేవాలయం. 609 ఏడీ లో ఇటలీలోని రోమ్ లోని ఒక కేథలిక్ చర్చి ఇది. ఆగస్టస్ పాలనలో మార్కస్ అగ్రిప్ప దీనిని నిర్మించారు. క్రీస్తు శకం 126లో దీనిని హాడ్రియన్ అనే చక్రవర్తి పునర్నిర్మించారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Do you know the 10 most famous wonders of the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com