Chanakya Niti Success: ఆచార్య చాణక్యుడు ప్రతి విషయం గురించి ఎంతో ముందు చూపుతో వ్యవహరించేవాడు. మనిషి జీవితంలో దేన్ని పట్టుకోవాలి. వేటిని వదులుకోవాలనే వాటిపై సమగ్రంగా వివరించాడు. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలో కూడా చెప్పాడు. మనిషి చేయకూడని తప్పులు ఏంటి? ఏ విషయాలను పట్టించుకోవాలో కూడా అర్ధవంతంగా తెలిపాడు. చాణక్య నీతిశాస్త్రంలో ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. ఎన్నో మనకు ఆచరణీయంగా ఉంటాయి. వైవాహిక జీవితం సుఖంగా సాగాలంటే ఏం చేయాలో సూచించాడు.
నిజాయితీ
ఏ పని చేసినా నిజాయితీతో చేయాలంటాడు. దీంతోనే వారికి ప్రతిఫలం దక్కుతుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. నిజాయితీతో ఉన్నవాడు దేన్నయినా సాధిస్తాడు. అందులో ఉండే గొప్పతనం అదే. సమాజంలో కూడా తనకంటూ మంచి స్థానాన్ని సాధించుకుంటాడు. చేసే పనిలో మంచి ఉంటే చాలు. అది కచ్చితంగా మనం చేసి తీరుతాం.
కష్టం
మనం చేయాలనుకున్న పని ఎంత కష్టమైనా వదిలిపెట్టకూడు. దాన్ని సాధించేవరకు విడిచిపెట్టకూడదు. మొదలు పెట్టిన పనిని మధ్యలో వదిలేయడం తగదు. అందుకే మనం ఏదైనా మొదలు పెట్టకూడదు. మొదలు పెడితే విడిచిపెట్టకూడదు. ఈ సూత్రాన్ని పట్టుకుంటే మనకు అపజయమే కలగదు. చేసే పని ఎంత కష్టమైనా సరే ముందుకే వెళ్లాలి.
సాధన
సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన చెప్పాడు. ఏ పని అయినా సాధించాలనే తపన ఉండాలి. దాని కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. అప్పుడే మనకు అనుభవం కూడా సిద్ధిస్తుంది. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు విజయం తథ్యం. ఈ గుణం వ్యక్తి ఏ పనిలో అయినా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
జ్ణానం
మనిషికి తెలివితేటలు చాలా ముఖ్యం. సమయ స్ఫూర్తి కూడా అవసరమే. ఏ పని అయినా మన యుక్తితో పరిష్కరించుకోవాలి. తగిన సమయాల్లో మన ఆలోచనలతో పనిని ముందుకు వెళ్లనివ్వాలి. ప్రతిపనిలోనూ సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోవాలి. విజయానికి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడే మనం సునాయాసంగా విజయం సాధించి తీరుతాం.