
Bad Habits: మనం జాతకాలను నమ్ముతుంటాం. జ్యోతిష్యం ప్రకారం అన్ని పనులు చేసుకుంటాం. కానీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని పొరపాట్లు తెలియకుండా చేస్తుంటాం. వీటితో ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మనకు తెలియకుండానే కొన్ని మంచి పనులు చేస్తుంటాం. కొన్ని చెడు పనులు కూడా జరిగిపోతాయి. ఈ నేపథ్యంలో మనం కొన్ని వాస్తు పద్ధతులు పాటించాలి. లేకపోతే మనకు ఇబ్బందులు తప్పవు. మనకు తెలియకుండా తప్పులు చేసినా ప్రతికూలాలు పలకరించడం సహజం.
మన జీవితంలో ప్రతికూల ప్రభావాలు కలగకుండా ఉండాలంటే ఐదు పరిహారాలు పాటించాలి. ఈ ఐదు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. లేకపోతే జీవితంలో ముందుకు వెళ్లడం కష్టం. గ్రహాల ప్రభావంతో కొన్ని పనులు మనకు అనుకూలంగా మరికొన్ని పనులు ప్రతికూలంగానూ మారతాయి. ఈ క్రమంలో మన ఇంట్లో వస్తువులను సరైన దిశలో అమర్చుకోవాలి. కొన్ని పనులు సక్రమంగా చేయకపోతే ఇబ్బందులు రావడం ఖాయం.
కొందరు నడుస్తుంటే మామూలుగా ఉంటుంది. ఇంకా కొందరు మాత్రం కాళ్లు భూమికి కొట్టుకుంటూ నడుస్తారు. ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇలా నడవడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ప్రతికూలతలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. సంసారంలో కలతలు మొదలవుతాయి. ఈ చెడు అలవాటు మనకు కష్టాలు తెస్తుంది.
కొంతమంది వంట గదిలో పాత్రలు ఎలా పడితే అలా పడేస్తారు. తిన్న గిన్నెలను శుభ్రం చేయకుండా ఉంచుకోకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. పేదరికం పలకరిస్తుంది. రోడ్డుపై నడిచేటప్పుడు ఉమ్మివేస్తారు. జీవితంపై చంద్రుడు, శుక్రుడు ప్రతికూలతలు కలిగిస్తాయి. ఆర్థిక నష్టాలు తెస్తుంది. కష్టాలు పడాల్సి వస్తుంది.

ఇంకా కొందరికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. జాతకంలో సూర్యుడు బలహీనమై ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ఉత్తమం. ఇలా మన జీవితంలో చేయకూడని పనులు చేయకుండా ఉండటం వల్ల ఎలాంటి తిప్పలు రాకుండా ఉంటాయి.