
Watermelon: వేసవిలో ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం డీ హైడ్రేషన్ కాకుండా ఉండాలి. అంటే ఎక్కువగా వాటర్ కలిగి ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ తరుణంలో సమ్మర్ లో ఎక్కువశాతం పుచ్చకాయలు అమ్ముడు పోతుంటాయి. శరీరంలో వాటర్ లెవల్స్ హెచ్చు తగ్గులు కాకుండా పుచ్చకాయ ఎంతో ఉపయోగాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది పుచ్చకాయను రకరకాల పద్దతుల ద్వారా తీసుకుంటారు. కొందరు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెట్టి కూల్ అయిన తరువాత తీసుకుంటారు. మరికొందరు దానిని తీసుకొచ్చి కట్ చేసే సమయం లేనివారు మార్కెట్లో ఐస్ పై పెట్టిన పుచ్చకాయ ముక్కలను కొనుగోలు చేసి తింటారు. కానీ ఇలా తినడం వల్ల లాభం కంటే నష్టమే ఉందంటున్నారు వైద్య నిపుణులు. అదెంటో చూద్దాం.
వేసవిలో శరీరానికి కూల్ ఫ్రూట్స్ మార్కెట్లోకి విరివిగా వస్తాయి. వీటిలో పుచ్చకాయ ఒకటి. ఒకప్పుడు కేవలం సమ్మర్లో మాత్రమే ఇవి కనిపించేవి. కానీ దీని పటంటను వేసుందుకు చాలా మంది ఇంట్రెస్ట్ పెట్టడంతో అన్ని కాలాల్లో మార్కెట్లో లభ్యమవుతోంది. అయితే వేసవిలో దీని అవసరం ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్లో ఎక్కువగా అమ్ముడు పోతుంటాయి. మిగతా ఫ్రూట్స్ కంటే వీటి ధరలు కూడా తక్కువగా ఉండడంతో చాలా మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పుచ్చకాయ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు.

అయితే పుచ్చకాయను మార్కెట్లో కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన తరువాత కొంత మంది దానిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ దీనిని ఫ్రిజ్ లో పెట్టకూడదని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉండడం వల్ల దానిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. పుచ్చకాయను కట్ చేసిన తరువాత అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. పుచ్చకాల్లో యాంటిఆక్సిడెంట్లు, బీ విటమన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల దీనిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వీటిలో కొన్ని మాయమైపోతాయి.
ఇక ఐస్ ముక్కలపై పెట్టిన పుచ్చకాయ ముక్కలను అస్సలు తినొద్దని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఐస్ తయారయ్యే నీరు శుబ్రంగా ఉండొచ్చు.. లేకపోవచ్చు.. దానికి గ్యారంటీ లేదు. పుచ్చకాయను కట్ చేసిన ముక్కలు ఐస్ ముక్కలపై పెట్టడం ద్వారా ఐస్ లోఉండే బ్యాక్టిరియా పుచ్చకాయలోకి చేరుతుంది. దీంతో నాచురాలిటీ కోల్పోతుంది. అందువల్ల పుచ్చకాయను మార్కెట్లోకి తీసుకున్న తరువాత డ్రై కూల్ లో ఉండే ప్రదేశంలో మాత్రమే ఉంచి.. నేరుగా కట్ చేసుకొని తినాలి. అప్పుడు దాని ఫలితాన్ని పొందుతారు.