https://oktelugu.com/

Naga Chaitanya: అఖిల్ కాకుండా నాగచైతన్యకు మరో తమ్ముడా? ఎవరతను?

Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచాడు. కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య సరైన హిట్ కోసం వేచిచూసి ‘లవ్ స్టోరీ’తో ఆ ముచ్చట తీర్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నాగచైతన్య ప్రస్తుతం సమంతతో విడిపోయాక సైలెంట్ అయ్యారు. సమంత అమ్మానాన్న కూడా విడిపోయిన వారే. రామానాయుడు కూతురుతో నాగార్జున విడిపోయాడు. వీరిద్దరికి జన్మించిన వ్యక్తియే నాగచైతన్య. ఇక ఇతడి జీవితంలోనూ ఆ విడాకుల బాధ […]

Written By: , Updated On : April 2, 2022 / 10:45 AM IST
Follow us on

Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచాడు. కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చైతన్య సరైన హిట్ కోసం వేచిచూసి ‘లవ్ స్టోరీ’తో ఆ ముచ్చట తీర్చుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నాగచైతన్య ప్రస్తుతం సమంతతో విడిపోయాక సైలెంట్ అయ్యారు.

Naga-Chaitanya-Family-Back-Ground-Mother-Father-Brothers

Naga-Chaitanya-Family-Back-Ground-Mother-Father-Brothers

సమంత అమ్మానాన్న కూడా విడిపోయిన వారే. రామానాయుడు కూతురుతో నాగార్జున విడిపోయాడు. వీరిద్దరికి జన్మించిన వ్యక్తియే నాగచైతన్య. ఇక ఇతడి జీవితంలోనూ ఆ విడాకుల బాధ తప్పలేదు.

ప్రస్తుతం నాగచైతన్యకు అఖిల్ తమ్ముడిగా ఉన్నారు. తల్లులు వేరు అయినా తండ్రి నాగార్జున ఒక్కటే. వీరందరూ కలిసే ఉంటున్నారు. అయితే నాగచైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్న విషయం తాజాగా బయటపడింది. ఇది చాలా మందికి తెలియని నిజం అట.. సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు బాగానే చర్చ జరుగుతోంది.

నాగచైతన్య అమ్మగారు లక్ష్మీతో ఒకప్పుడు నాగార్జునకు పెళ్లి జరిగింది. రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టాక వారిద్దరూ విడిపోయారు. కుటుంబాల మధ్య మాత్రం రిలేషన్ ఉంది.

నాగార్జునతో విడిపోయిన లక్ష్మీ చెన్నై బిజినెస్ మ్యాన్ శరత్ విజయరాఘవన్ ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు చైతన్య తల్లిదగ్గరే పెరిగాడు. అనంతరం తండ్రి నాగార్జున వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు.

Also Read: Acharya: ‘ఆచార్య’ నుంచి మరో ఇంట్రస్టింగ్ అప్​డేట్​కు రెడీగా ఉన్నారా?

చైతన్య తల్లి, ఆమె చేసుకున్న శరత్ విజయ రాఘవన్ దంపతులకు కూడా ఓ కొడుకు ఉన్నాడు. ఆ మధ్య ఫొటోల్లో కనిపించాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్నారు. కొన్నాళ్ల కిందనే లక్ష్మీ-శరత్ కొడుకు పెళ్లి ఘనంగా చెన్నైలో జరిగింది. ఈ పెళ్లికి చైతన్య-సమంత కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలా నాగచైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడన్న విషయం బయటపడింది.

Also Read: Naga Chaitanya: జోష్ టూ లవ్ స్టోరీ.. బర్త్ డే బాయ్ నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ చిత్రాలు ఇవే!