https://oktelugu.com/

Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

Srilanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నానాటికి పరిస్థితి దిగజారిపోతోంది. ఆహారం అందుబాటులో ఉండటం లేదు. ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దిగాజారిందో తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే అనాలోచిత నిర్ణయాల కారణంగా సంక్షోభంలోకి వెళ్లిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం గమనార్హం. విద్యుత్ కోతలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2022 / 10:37 AM IST
    Follow us on

    Srilanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నానాటికి పరిస్థితి దిగజారిపోతోంది. ఆహారం అందుబాటులో ఉండటం లేదు. ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దిగాజారిందో తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే అనాలోచిత నిర్ణయాల కారణంగా సంక్షోభంలోకి వెళ్లిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం గమనార్హం.

    Srilanka Crisis

    విద్యుత్ కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు దాదాపు 13 గంటల పాటు విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో ఏర్పడిన పరిస్థితికి అధ్యక్షుడు రాజపక్సే కారణమంటూ నిరసన కారులు ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. కాగితం కొరతతో పరీక్షలు కూడా వాయిదా వేసే దుస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.

    Also Read: Jobs: అదిలాబాద్ రిమ్స్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్షకు పైగా వేతనంతో?

    దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. రాజపక్స అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయాలతోనే దేశం అగాధంలో పడిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆదాయ పన్ను నుంచి మినహాయింపులు ఇచ్చినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఫలితంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఆకలితో అతలాకుతలం అవుతున్నారు. నిత్యావసర ధరలు మాత్రం దిగి రావడం లేదు.

    Srilanka Crisis

    శ్రీలంక పరిస్థితికి చలించి భారత్ సాయం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సంక్షోభం తీవ్ర స్తాయికి చేరిన క్రమంలో శ్రీలంక కోలుకోవడం కలగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి భారత్ మరో 1 బిలియన్ డాలర్ల సాయం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ అందిస్తున్న సాయంతో మెరుగు కావాలని కోరుకున్నా సాధ్యపడటం లేదు. అందుకే శ్రీలంక కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read: Imran Khan wife Reham khan :అంత సీన్ లేదు.. ఇమ్రాన్ ఖాన్ పరువు తీసిన ఆయన మాజీ భార్య

    Tags