https://oktelugu.com/

NTR Son Jayakrishna: ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ ఫస్ట్ టైం బయటకు.. ఎలా ఉన్నాడో తెలుసా?

NTR Son Jayakrishna: నందమూరి తారకరామారావు వారసత్వాన్ని సీనీ ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు ఆయన కుమారుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ లు.. వీరే కాదు.. మిగతా చిన్నా చితకా హీరోలు కూడా ఆయన నటవారసులుగా మెరుస్తున్నారు. తాజాగా మరో వారసుడు సినీ ఎంట్రీ ఇస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ తాజాగా తన కుమారుడిని లాంచ్ చేస్తున్నారు. జయకృష్ణ చాలా దూరంగా జీవిస్తున్నారు. మీడియాకు, రాజకీయాలకు, బయట వేడుకలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు […]

Written By: , Updated On : June 2, 2022 / 01:56 PM IST
Follow us on

NTR Son Jayakrishna: నందమూరి తారకరామారావు వారసత్వాన్ని సీనీ ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు ఆయన కుమారుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ లు.. వీరే కాదు.. మిగతా చిన్నా చితకా హీరోలు కూడా ఆయన నటవారసులుగా మెరుస్తున్నారు. తాజాగా మరో వారసుడు సినీ ఎంట్రీ ఇస్తున్నాడు.

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ తాజాగా తన కుమారుడిని లాంచ్ చేస్తున్నారు. జయకృష్ణ చాలా దూరంగా జీవిస్తున్నారు. మీడియాకు, రాజకీయాలకు, బయట వేడుకలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు తాను చేసుకుంటారు. ఎన్టీఆర్ కు పెద్ద కుమారుడు అయినా ఆయన బాలకృష్ణ, హరికృష్ణలా యాక్టివ్ గా ఉండే వారు కాదు.

చాలా రోజులకు ఆయన బయటకు వచ్చాడు. తన కుమారుడిని సీనీ ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. నందమూరి జయకృష్ణ తాజాగా ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ ను ‘నందమూరి బాలకృష్ణ’ చేతులమీదుగా లాంఛ్ చేశారు.

బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్యకృష్ణ ప్రొడక్షన్స్ నెంబర్ 1గా పరిచయం అవుతున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విభిన్నమైన చిత్రం లాంచ్ సందర్భంగా జయకృష్ణ బయటకు వచ్చారు.

బాలయ్య మాట్లాడుతూ.. ‘బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ ను ప్రారంభించిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు.. ఇది మా సొంత బ్యానర్’అంటూ బాలయ్య ఓన్ చేసుకున్నారు. ఇది మా అన్నాదమ్ములందరి బ్యానర్ అని.. అమ్మానాన్నల పేర్లు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా నాన్న తర్వాత మా కుటుంబంలో పెద్ద అయిన అన్నయ్య జయకృష్ణ ఆశీర్వాదాలను బాలకృష్ణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే జయకృష్ణ హగ్ చేసుకున్నారు. ఎప్పుడూ బయట కనపడని జయకృష్ణ తొలిసారి ఇలా కనిపించేసరికి వైరల్ అయ్యింది.

Balakrishna Introduced His Elder Brother Son | Sr NTR First Son Nandamuri Jaya Krishna | Chaitanya