Lokesh Kanagaraj- Prabhas: టాలెంట్ పక్కన పెడితే నటుల కెరీర్ నిర్ణయించేది చిత్రాల ఎంపికే. దర్శకులను వాళ్ళు తెచ్చే స్క్రిప్ట్స్ ని కరెక్ట్ గా జడ్జి చేసే సత్తా ఉన్నప్పుడు లాంగ్ కెరీర్, భారీ ఇమేజ్ సొంతం అవుతుంది. కాగా ఓ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని ప్రభాస్ రిజెక్ట్ చేయడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా చిత్ర దర్శకుడిగా ఎదగాలనుకునే వారికి ప్రభాస్ బెస్ట్ ఆప్షన్. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, మార్కెట్ ఉన్న ప్రభాస్ వెంట పలు పరిశ్రమలకు చెందిన దర్శకులు పడుతున్నారు. ఆయన అప్ కమింగ్ చిత్రాలైన ఆదిపురుష్ తెరకెక్కిస్తోంది బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, సలార్ ని కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
ఇక ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల దర్శకులుగా టాలీవుడ్ కి చెందిన నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. మరో మూవీ దర్శకుడు మారుతితో ప్రకటించారు. స్పిరిట్ కంటే ముందు మారుతి మూవీ పూర్తి చేయనున్నాడు ప్రభాస్. కాగా కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రభాస్ ని ఓ మూవీ కోసం సంప్రదించారట. అయితే లోకేష్ కనకరాజ్ కి ప్రభాస్ నో చెప్పారనేది తాజా సమాచారం.
Also Read: Bharateeyudu 2: భారతీయుడు2 ఇక నా చేతుల్లో లేదు
ఈ క్రమంలో అంత టాలెంటెడ్ డైరెక్టర్ ని ప్రభాస్ రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ప్రభాస్ ఆఫర్స్ ఇచ్చిన కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావిస్తూ… వాళ్ళ మాత్రం టాలెంట్ కనకరాజుకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. టూ టైర్ హీరోలతో సినిమాలు చేసే మారుతికి ప్రభాస్ ఆఫర్ ఇచ్చాడు. అలాగే పెద్దగా అనుభవం లేని దర్శకులు సుజీత్, రాధాకృష్ణలకు కూడా ఆఫర్స్ ఇచ్చాడు. అలాంటిది కనకరాజ్ ని రిజెక్ట్ చేయడం ఏంటి అంటున్నారు.
ఇక కనకరాజ్ రికార్డు చూసినా చాలా బాగుంది. ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే విజయ్ తో తెరకెక్కించిన మాస్టర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో కూడా మాస్టర్ చెప్పుకోదగ్గ వసూళ్లను అందుకుంది. ఇక విక్రమ్ రూపంలో ఆయన మరో భారీ కమర్షియల్ మూవీ తెరకెక్కించారు. భారీ హైప్ మధ్య విడుదలవుతున్న విక్రమ్ ఫలితం ఏమిటో జూన్ 3న తేలనుంది. ఈ క్రమంలో ప్రభాస్ కనకరాజ్ మూవీ రిజెక్ట్ చేయాల్సింది కాదంటున్నారు కొందరు.
Also Read:Neelambari Character In Narasimha Movie: నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా??
Recomended Videos