Zomato: ఇప్పటివరకూ జోమాటో తిండి కోసం మీరు ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?

ఈరోజు ఏం ఆర్డర్‌ చేద్దాం అని అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంతో ఈజీ ఫుడ్, రెడీమేడ్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న విషయం మచ్చిపోతున్నాం.

Written By: Raj Shekar, Updated On : December 31, 2023 11:04 am

Zomato

Follow us on

Zomato: ఫ్రెండ్స్‌ పార్టీ అనగానే జొమాటో ఆర్డర్‌ పెట్టాలి.. సండే వచ్చింది అంటే.. స్విగ్గీకి ఫోన్‌ కొట్టాలి.. పండుగ వచ్చిందంటే.. మరో ఆర్డర్‌… ప్రస్తుతం అంతా ఆర్డర్ల కాలం నడుస్తోంది. సొంతంగా వంట చేసే రోజులు మారిపోతున్నాయి. స్వయం పాకాలకు కాలం చెల్లుతోంది. ఈ రోజు ఏం వండుకుందాం అనే బదులు ఇంటి ఆడవాళ్లు.. ఈరోజు ఏం ఆర్డర్‌ చేద్దాం అని అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంతో ఈజీ ఫుడ్, రెడీమేడ్‌ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న విషయం మచ్చిపోతున్నాం. అయితే స్విగ్గీలో మాత్రం మనం ఎంత ఖర్చు చేశామో తెలుసుకునే అవకాశం ఉంది.

ఇలా తెలుసుకోవచ్చు…
స్విగ్గీ కోసం ఎంత ఖర్చు పెట్టామో ఇలా తెలుసుకోవచ్చు.
= సిస్టంలో గూగుల్‌ ఓపెన్‌ చేసి జొమాటో స్పెండింగ్‌ క్యాలక్యులేటర్‌ అని టైప్‌ చేయగానే ఒక క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ వస్తుంది. దానిని మన సిస్టంకు యాడ్‌ చేయాలి.

= తర్వాత జొమాటో అని మరో ట్యాబ్‌లో టైప్‌ చేయాలి. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాగానే లాగిన్‌ అడుగుతుంది.

= మొబైన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌చేయగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయగానే లాగిన్‌ అవుతుంది.

= ఆ తర్వాత మొదట సిస్టంకు యాడ్‌ చేసిన ఎక్స్‌టెన్షన్‌ మీద క్లిక్‌ చేయగానే ఆటోమేటిక్‌గా జొమాటో కోసం ఇప్పటి వరకు మనం ఎంత ఖర్చు పెట్టామనే వివరాలు వస్తాయి.

షాక్‌ అవుతున్న కస్టమర్లు..
ఒక్కొక్కరు.. ఇలా జొమాటోకు ఎంత ఖర్చు పెట్టామో తెలుసుకుని షాక్‌ అవుతున్నారు. హైదరాబాద్‌ నగర వాసులు అయితే ఒక్కో కుటుంబం కనీసం రూ.50 వేలకుపైనే ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు. కొంతమంది వెయ్యి, రెండు వేలు ఖర్చు పెట్టారు. కొంతమంది కస్టమర్లు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. మరికొందరు రూ.1.50 లక్షలు వెచ్చించారు.