
Rana Daggubati: దగ్గుపాటి కుటుంబం నుండి ఇండస్ట్రీ కి వచ్చిన మరో హీరో రానా , పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తో ఆయన తన రేంజ్ ని బాగా పెంచేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.కానీ ఆ తర్వాత రానా సినిమాలకు బాగా దూరమయ్యాడు.
అందుకు కారణం ఆయనకీ ఉన్న ఆరోగ్య సమస్యలే,పలు ఇంటర్వ్యూస్ లో బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేసి ఉంటే ఈరోజు నా రేంజ్ ఎవ్వరు ఊహించని స్థాయిలో ఉండేది, పూర్తి నా బ్యాడ్ లక్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నాడు. వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేసాడు, రీసెంట్ గానే ఆయన తన బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘రానా నాయుడు’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించాడు.
ఈ సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ ‘మీరు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారని, మీ కిడ్నీ లు మార్పిడి కూడా జరిగిందని మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది, దీనిపై మీ స్పందన ఏమిటి’ అని అడగగా, రానా దానికి సమాధానం చెప్తూ ‘నిజమే ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులనే ఎదురుకున్నాను,నా జీవితం లో నేను చూసిన అతి దరిద్రంగా రోజులు అవే, కానీ ఆరోజులు నాకు ఎంత కఠినతరమైన సమస్యలు వచ్చినా ఎలా ఎదురుకోవాలి అనేది నాకు నేర్పించింది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు.

తన ఆరోగ్యం మొత్తం కుదుట పడిన తర్వాత మిహీక బజాజ్ అనే అమ్మాయిని పెళ్లాడాడు. సినిమాలు కూడా వరుసగా చెయ్యడం ప్రారంభించాడు.ప్రస్తుతం ఆయన రానా నాయుడు వెబ్ సిరీస్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన చెయ్యబొయ్యే తదుపరి చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చెయ్యబోతున్నాడు.