
Junior NTR: నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతుంది అని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే వార్త. ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని అభిమానులు ఫీల్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన నందమూరి తారకరత్న పెద్ద ఖర్మ కార్యక్రమం లో , బాలయ్య బాబు అక్కడకి వచ్చిన ప్రతీ ఒక్కరిని ఎంతో ప్రేమగా పలకరించాడు కానీ, జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం ఆయన కనీసం కూడా పట్టించుకోలేదు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ చెల్లెలు కొడుకు శ్రీ హర్ష కి నిశ్చితార్థం అయ్యింది. ఈ నిశ్చితార్ధ వేడుకకి నందమూరి కుటుంబ సభ్యులందరూ వచ్చారు , ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప.సుహాసిని , కళ్యాణ్ రామ్ మరియు జానకి రామ్ హరి కృష్ణ మొదటి భార్య కి జన్మించిన సంతానం.
జూనియర్ ఎన్టీఆర్ హరి కృష్ణ రెండవ భార్య షాలిని కి జన్మించిన సంతానం. హరికృష్ణ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎమోషనల్ గా బాగా దగ్గరయ్యారు. ఎక్కడకి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు,అలాంటిది కళ్యాణ్ రామ్ సొంత చెల్లెలు సుహాసిని కొడుకు నిశ్చితార్థం కి ఎన్టీఆర్ రాకపోవడం ఏమిటి ..?, మళ్ళీ వీళ్ళ మధ్య ఎమన్నా గొడవలు ఏర్పడ్డాయా అనే సందేహాలు మొదలయ్యాయి.ఎన్టీఆర్ హైదరాబాద్ సిటీ లో లేక రాలేదు అని అనుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోవచ్చు.

కానీ ఆయన అమెరికాలో ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో పాల్గొని హైదరాబాద్ కి మొన్ననే వచ్చేసాడు. అయినా కూడా నిశ్చితార్థం కి రాకపోవడం పై ఎన్టీఆర్ ఉద్దేశ్యం ఏమనుకోవాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మరో వైపు కళ్యాణ్ తన కుటుంబం తో సహా ఈ నిశ్చితార్ధ వేడుకలో పాల్గొని, మొత్తం కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ నిశ్చితార్థం కి రాకపోవడం పెద్ద చర్చలకు దారి తీస్తుంది.