Keerthy Suresh Assets: ఒక్కసారి స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంటే చాలు లైఫ్ మారిపోతుంది. జీవితానికి సరిపడా సంపాదన సొంతం అవుతుంది. కో అంటే కోట్లు వచ్చిపడతాయి. కార్లు, బంగళాలు… లగ్జరీ జీవితం. అందుకే అష్టకష్టాలు, అవమానాలు ఎదురైనా అమ్మాయిలు హీరోయిన్ కావాలని పరిశ్రమలో యుద్ధం చేస్తూ ఉంటారు. వందల మంది పోటీపడే ఈ గ్లామర్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేది కొందరే. ఆ కొందరిలో స్టార్ అయ్యేది ఇంకొందరు మాత్రమే. గాడ్ ఫాదర్స్, బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకు పెద్దగా స్ట్రగుల్స్ ఉండవు. సులభంగా ఎంట్రీ లభిస్తుంది. టాలెంట్ ఉంటే స్టార్ కావచ్చు.

స్టార్ కిడ్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన కీర్తి సురేష్ ప్రతిభతో పరిశ్రమలో రాణిస్తుంది. కీర్తి తల్లిగారు మేనక 80లలో స్టార్ హీరోయిన్. సౌత్ లో ఆమె వందల చిత్రాలు చేశారు. ఇక కీర్తి ఫాదర్ సురేష్ దర్శకుడు. ఈ క్రమంలో కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా నట ప్రస్థానం మొదలుపెట్టారు. 2013లో విడుదలైన మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్ గా మారారు. మోహన్ లాల్ ఆ చిత్ర హీరో. తెలుగులో కీర్తి ఫస్ట్ మూవీ నేను శైలజ. రామ్ కి జంటగా కీర్తి నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అనూహ్యంగా అజ్ఞాతవాసి మూవీలో పవన్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. అజ్ఞాతవాసి అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో మళ్ళీ స్టార్స్ పక్కన ఛాన్స్ రాలేదు. అయితే అదే ఏడాది విడుదలైన మహానటి కీర్తి ఫేట్ మార్చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తెలుగు, తమిళ భాషలో సంచలనం రేపింది. సావిత్రిగా పరకాయ ప్రవేశం చేసిన కీర్తికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఏకంగా జాతీయ అవార్డుకి ఎంపికయ్యింది.

మహానటి చిత్రం తర్వాత కీర్తి మార్కెట్ బాగా పెరిగింది. కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి వెళ్ళింది. ప్రస్తుతం కీర్తి సినిమాకు రూ. 3 కోట్లకు తగ్గకుండా తీసుకుంటున్నారట. గత మూడేళ్ళలో కీర్తి 10 చిత్రాలు విడుదల చేశారు. రమారమి ఆమె సంపాదన రూ. 30 కోట్లు అని చెప్పాలి. ప్రమోషన్స్, ఎండార్స్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. ప్రస్తుతం దసరా, భోళా శంకర్ చిత్రాలతో పాటు రెండు తమిళ చిత్రాలు చేస్తున్న కీర్తి ఏడాదికి రూ. 10 కోట్లకు తగ్గకుండా సంపాదిస్తున్నారట. సోలోగా కీర్తి కూడబెట్టిన ఆస్తుల విలువ రూ. 50 కోట్లకు పైమాటే అంటున్నారు.