Gracy Singh: సినీ ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు చాలాకాలం కొనసాగుతారు కావొచ్చు. కానీ నటీమణులు మాత్రం కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తరువాత సినిమాలు మానేస్తారు. హీరోయిన్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా డైరెక్టర్లు కొత్తవారికే అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. అలా చాలా మంది హీరోయిన్లు సినీ ఫీల్డుకు వచ్చి ఆ తరువాత కొన్ని రోజులకే ఇతర రంగాల్లో సెటిలైపోయారు. అయితే కొందరు భామలు ఒకటి, రెండు సినిమాల్లోనే నటించినా వారి అభినయంతో ప్రేక్షకాదరణ విపరీతంగా పొందారు. వారు సినిమాల్లో లేకున్నా వారి గురించి చర్చలు పెట్టుకుంటున్నారు. అలాంటి హీరోయిన్లలో గ్రేసీ సింగ్ ఒకరు. ఇప్పుడు గ్రేసీసింగ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆమె ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఉందా?
అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ సంతోషం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ గా కూడా మంచి సక్సెస్ అయింది. ఇందులో శ్రియతో పాటు గ్రేసిసింగ్ హీరోయిన్. గ్రేసిసింగ్ కనిపించింది కాసేపే అయినా ఆమె ఫర్ఫామెన్ష్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆ సమయంలో చాలా మంది గ్రేసి సింగ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే గ్రేసిసింగ్ తెలుగులో పెద్దగా రాణించలేదు. ఈ సినిమా తరువాత మోహన్ బాబుతో కలిసి తప్పు చేసి అప్పుకూడు అనే సినిమాలోకనిపించారు. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ ఆమెకు అవకాశాలు రాలేదన్న చర్చ సాగింది.
మరి గ్రేసిసింగ్ ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గ్రేసీ సింగ్ ఆమె నటించిన మొదటి సినిమా ‘లగాన్’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమా తరువాత తెలుగులో సంతోషం సినిమాలో నటించింది. అయితే తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లోనూ ఆమె ఆకట్టుకున్నారు. ఆమె నటించిన గంగాజల్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటివి మంచి పేరు తెచ్చుకున్నాయి. చివరిగా ఓ పంజాబీ చిత్రంలో నటించిన గ్రేసీసింగ్ ఆ తరువాత తెరపై కనిపించలేదని తెలుస్తోంది.
అయితే గ్రేసీసింగ్ పెళ్లి చేసుకోలేదట. ప్రస్తుతం ఆమెకు 42 ఏళ్లు. భరతనాట్యంలో ప్రావీణ్యులరాలైన ఆమె తన పేరిట ‘గ్రేసీ సింగ్ డ్యాన్స్ ట్రూప్’ని ప్రారంభించింది. దీని ద్వారా దేశ, విదేశాల్లో తన ప్రదర్ననలు చేసింది. వీటితో పాటు ఆధ్యాత్మక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నారు. బ్రహ్మకుమారీ విశ్వవిద్యాలయంలో సభ్యురాలిగా ఉంటూ తరుచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మిగతా హీరోయిన్లలాగా సోషల్ మీడియాలో ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. కానీ కొందరు ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి.