Rare Blood Group: అరుదైన బ్లడ్‌ గ్రూప్‌.. ప్రపంచంలో ఎంత మందికి ఉందో తెలుసా?

కొన్ని అరుదైన బ్లడ్‌ గ్రూపులు ఉన్నాయి. ఇవి దొరకడం చాలా కష్టం. చాలా మంది బొంబాయి బ్లెడ్‌ గ్రూప్‌ అరుదు అనుకుంటారు.. కానీ అంతకన్నా అరుదైన గ్రూపు రక్తం కూడా ఒకటి ఉంది. ఆ గ్రూపు ఏంటి.. ఎంత మందికి ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం.

Written By: Raj Shekar, Updated On : April 23, 2024 4:50 pm

rare blood group in World

Follow us on

Rare Blood Group: దానాల్లో అన్నదానం గొప్పది.. ఇది నాటి మాట.. దానాల్లో రక్త దానం చాలా గొప్పది ఇది నేటి మాట. రక్తదానం ప్రాణదానం లాంటిదే. అందుకే స్వచ్ఛంద సంస్థలు రక్తదానంపై అవగాహన కల్పిస్తుంటాయి. ఇక దాతలతో ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయిస్తుంటాయి. ఆరోగ్యవంతమైనవారు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేసిన వారవుతారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. రక్తం గ్రూపులు వేరైనా ఉండే రంగు మాత్రం ఒక్కటే. అయితే కొన్ని అరుదైన బ్లడ్‌ గ్రూపులు ఉన్నాయి. ఇవి దొరకడం చాలా కష్టం. చాలా మంది బొంబాయి బ్లెడ్‌ గ్రూప్‌ అరుదు అనుకుంటారు.. కానీ అంతకన్నా అరుదైన గ్రూపు రక్తం కూడా ఒకటి ఉంది. ఆ గ్రూపు ఏంటి.. ఎంత మందికి ఉంటుంది అనే వివరాలు తెలుసుకుందాం.

1952లోనే గుర్తింపు..
ఈ అరుదైన బ్లడ్‌ గ్రూపును 1952లోనే గుర్తించారు. బొంబాయిలో డాక్టర్‌ యం.భేండే తొలిసారిగా కనుగొన్నారు. అదే హెచ్‌హెచ్‌( (HH) బ్లడ్‌ గ్రూపు. ఈ రకమైన అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ప్రపంచంలోని జనాభాలో 0.0004 శాతం మందిలో మాత్రమే ఉందట. భారతదేశంలో 10 వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ బ్లడ్‌ గ్రూప్‌ ఉంది. దీనిని HH బ్లడ్‌ గ్రూప్‌ లేదా అరుదైన ABO బ్లడ్‌ గ్రూప్‌ అని కూడా అంటారు.

చక్కెర అనువులు లేకుండా..
మనిషిలో ఉండే ఎర్ర రక్తకణాల్లో చక్కెర అణువులు ఉంటాయి. ఈ చక్కెర అణువులు ఒక వ్యక్తి బ్లడ్‌గ్రూపును నిర్ణయిస్తాయి. అయితే హెచ్‌హెచ్‌ బ్లడ్‌ గ్రూపు రక్తం ఉన్నవారి ఎర్రరక్త కణాల్లో చక్కెర అణువులు తయారు కావు. అందుకే ఇది ఏ బ్లడ్‌ గ్రూపు పరిధిలోకి రాదు. ఈ బ్లడ్‌ గ్రూప్‌లోని వ్యక్తుల ప్లాస్మాలో A, B, H అనే యాంటీబాడీస్‌ ఉంటాయి.

సాధారణ జీవితమే..
ఈ గ్రూప్‌ అరుదైనదే అయినా.. ఈ గ్రూపు బ్లడ్‌ ఉన్నవారు మిగతా గ్రూపుల రక్తం ఉన్నవారిలానే సాధారణ జీవితం గడుపుతారు. వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక ఈ గ్రూపు దగ్గరి రక్తసంబంధాలు ఉన్నవారిలో మాత్రమే కనబడుతుంది. ముంబైలో కేవలం 0.01 శాతం మందికి మాత్రమే ఈ గ్రూపు రక్తం ఉంది. తల్లిదండ్రుల బ్లడ్‌ గ్రూప్‌ హెచ్‌హెచ్‌ అయితే పిల్లలది కూడా అదే గ్రూప అవడానికి అవకాశం ఉంది.

ఈ గ్రూపు రక్తమే తీసుకోవాలి..
ఇక హెచ్‌హెచ్‌ గ్రూపు రక్తం ఉన్నవారికి రక్తం అవసరమైతే అదే గ్రూపు దొరకడం చాలా కష్టం. అయితే వీరు బొంబాయి గ్రూపు బ్లడ్‌ ఉన్నవారి నుంచి రక్తం తీసుకోవచ్చని వైద్యులు తెలిపారు. అందుకే అరుదైన గ్రూపు రక్తం ఎవరు దానం చేసినా నిల్వ చేస్తున్నారు. ఇతర గ్రూపు బ్లడ్‌ ఎక్కిస్తే రోగి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.