Bank Holidays: 2024 మార్చి నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు రానున్నాయి. మార్చిలో ఎక్కువగా పండుగలు లేకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల 9 రోజుల పాటు హాలీడేస్ ప్రకటించారు. దీంతో వినియోగదారులు అప్రమత్తమవుతున్నారు. కొందరు నిత్యం బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసుకునేవారు ఇతర మార్గాలు చూసుకుంటుండగా ..మరికొందరు మాత్రం సెలవు రోజుల్లో డబ్బు మార్చడం ఎలా? అని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్ని రోజులు సెలవులు రాలేదు. ఈసారి వచ్చిన సెలవుల్లో కొన్ని రెండో, నాలుగో శనివారాలు ఉండగా మిగతా రోజులు ఆదివారాలు కూడా ఉన్నాయి.
బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులను నిర్ణయిస్తుంటుంది. అయితే ఈ సెలవులు అన్ని బ్యాంకులకు వర్తించకపోవచ్చరు. కొన్ని జాతీయ బ్యాంకులకు ఇవి వర్తించగా..మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఓపెన్ అయి ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతీయ బ్యాంకులు యధావిధంగా నడుస్తాయి. కేవలం జాతీయ బ్యాంకులు మాత్రమే సెలవులో ఉంటాయి. ఇంతకీ జాతీయ బ్యాంకులు ఏ యే రోజుల్లో సెలవుల్లో ఉంటాయంటే?
మార్చి 3 ఆదివారంతో అన్ని బ్యాంకులు మూసే ఉంటాయి. 8న మహాశివరాత్రి కారణంగా సెలవు, 9న రెండో శనివారం, 10 ఆదివారం తో బ్యాంకులు పనిచేయవు. అలాగే మార్చి 17 ఆదివారంతో బ్యాంకులు మూసే ఉంటాయి. మార్చి 23న నాలుగో శనివారం, 24న ఆదివారం, 25న హోలీ సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. మార్చి 29న గుడ్ ఫ్రైడే, 31న ఆదివారం కారణంగా సెలవు ఉంటుంది. మొత్తంగా నెలలో 9 రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అయితే మార్చి 1న చాప్పార్ కుత్ కారణంగా మిజోరాంలోని బజ్వాల్ నగరంలో బ్యాంకులు పనిచేయవు. అలాగే మార్చి 22న బీహార్ డే సందర్భంగా ఆరోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు బంద్ చేసి ఉంటాయి. మార్చి 26న యంయోసాంగ్ శువనేశ్వర్, ఇంపాల్, పాట్నాలోని కొన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇలా దేశ వ్యాప్తంగా 9 రోజుల బ్యాంకులు పనిచేయవు. కొన్నిరాష్ట్రాల్లో మరో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.