https://oktelugu.com/

Maruti Swift: అదిరిపోయేలా మారుతి స్విఫ్ట్.. కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి

కొత్త తరం స్విఫ్ట్‌ టెస్ట్‌ మ్యూల్స్‌ కొన్ని నెలల్లో చాలాసార్లు గుర్తించారు. మారుతికి స్విఫ్ట్‌ ఒక ముఖ్యమైన మోడల్‌. కొత్త వెర్షన్‌లో ప్రత్యేకించి ఫీచర్ల పరంగా కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందుపర్చాలని నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 1, 2024 / 04:39 PM IST
    Follow us on

    Maruti Swift: భారత మార్కెట్‌లో అత్యంత డిమాండ్‌ ఉన్న కార్లలో మారుతి స్విఫ్ట్‌ ఒకటి. సేఫ్టీతోపాటు గుడ్‌ లుకింగ్‌తో కార్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న మారుతి స్విఫ్ట్‌ దాదాపు పదేళ్లుగా మార్కెట్‌లో తనకు తిరుగు లేదని నిరూపిస్తోంది. మారుతీ కంపెనీ కూడా స్విఫ్ట్‌లో ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్స్‌ తీసుకు వస్తోంది. తాజాగా నాలుగో తరం స్విఫ్ట్‌ను మారుతి మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. కొత్త ఫీచర్‌తో వస్తున్న ఈ కారును కొద్ది వారాల్లో రోడ్లపై చూడవచ్చు.

    సరికొత్తగా మార్కెట్‌లోకి..
    కొత్త తరం స్విఫ్ట్‌ టెస్ట్‌ మ్యూల్స్‌ కొన్ని నెలల్లో చాలాసార్లు గుర్తించారు. మారుతికి స్విఫ్ట్‌ ఒక ముఖ్యమైన మోడల్‌. కొత్త వెర్షన్‌లో ప్రత్యేకించి ఫీచర్ల పరంగా కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లను పొందుపర్చాలని నిర్ణయించింది. ఈ ఫీచర్లలో చాలా వరకు కంపెనీ లైనప్‌లో అత్యంత ఫీచర్‌ లోడ్‌ చేయబడిన మోడల్‌లో ఒకటైర బ్రెజ్జా నుంచి తీసుకునే అవకాశం ఉంది.

    – ప్రస్తుతం స్విఫ్ట్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిని అధునాతనమైర 9 అంగుళాల యూనిట్‌తో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఈ యూనిట్‌ గ్రాండ్‌ విటారా, బ్రెజ్జా, ప్రాంటెక్స్, బలేనో వంటి మోడళ్లలో కూడా ఉంది.

    – కొత్వ వర్షన్‌ మోడల్‌లో వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే కనెక్టివిటీ, కనెక్ట్‌ చేయబడిన కార్‌ ఫీచర్‌తో అమర్చబడింది. ప్రీమియం కార్లలో వైర్‌లెస్‌ ఫోన్‌ చార్జింగ్‌ అనేది సాధారణం. ఇప్పుడు ఈ ఫీచర్‌ను చిన్న, బడ్జెట్‌ కార్లలో కూడా అందుబాటులోకి తెస్తుంది మారుతి.

    – మరో ఫీచర్‌ 360–డిగ్రీల కెమెరా జనాదరణ పొందిన ఫీచర్‌. ఇటీవల చాలా మోడళ్లలో ఈ కెమెరా ఉంటుంది. పార్కింగ్‌ స్థలాలు, బ్లైండ్‌ స్పాట్‌లను నివారించడంతో సహాయపడుతుంది.

    – ఇక మరో కొత్త ఫీచర్‌ హెడ్‌ అప్‌ డిస్‌ప్లే.. మారుతి బ్రెజ్జా, ఫ్రాంటెక్స్, గ్రాండ్‌ విటారాతో సహా పలు మోడళ్లలో హెడ్‌–అప్‌ డిస్‌ప్లే ఉంది. ఇప్పుడు కంపెనీ కొత్త తరం స్విఫ్ట్‌లో ఈ ఫీచర్‌ను అందించనుంది.

    – ప్రస్తుత స్విఫ్ట్‌ కారులో రెండు ఎయిర్‌ బ్యాగులు మాత్రమే స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది ప్రస్తుత కఠినమైన భద్రతా నిబంధనలకు సరిపోదు. అయితే కొత్త తరం స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లను ప్రవేశపెట్టాలని మారుతి భావిస్తోంది.