Ram Pothineni: రామ్ పోతినేని మిస్ చేసుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా?

కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన కెరీర్ ను నాశనం చేస్తుంటాయి. ఏ రంగమైన సరే ఇలాంటివి కచ్చితంగా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాల వల్లనే కెరీర్ డిసైడ్ అవుతుంటుంది. అయితే కెరీర్ నాశనం అవుతుందని తెలిసి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.

Written By: Swathi, Updated On : March 1, 2024 4:49 pm
Follow us on

Ram Pothineni: రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాస్ సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న రామ్.. మంచి హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఈయన సినిమాలు రాలేదు. దీంతో ఇక రామ్ నటించడేమో అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ లను కూడా సొంతం చేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో తన సత్తా చాటాడు రామ్. కానీ ఈయన మళ్లీ ఢీలా పడ్డాడా అంటున్నారు కొందరు..

కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన కెరీర్ ను నాశనం చేస్తుంటాయి. ఏ రంగమైన సరే ఇలాంటివి కచ్చితంగా ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాల వల్లనే కెరీర్ డిసైడ్ అవుతుంటుంది. అయితే కెరీర్ నాశనం అవుతుందని తెలిసి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ ఇలాంటి నిర్ణయమే తీసుకొని రామ్ తన కెరీర్ లో డిజాస్టర్ ను చవిచూశాడట. రాం పోతినేని రీసెంట్ గా స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎంత డిజాస్టర్ గా నిలిచిందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా రామ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. అంతేకాదు ఈయన పరువు తీసింది అంటారు కూడా కొందరు.అయితే ఈయన ప్రసెంట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈయన మంచి సినిమాలను వదులుకున్నాడని.. అందులో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అయిన కొత్త బంగారు లోకం సినిమా నట. ఈ సినిమా కోసం ముందుగా రామ్ ని కలిశారట మేకర్స్.

ఇంటర్ స్టూడెంట్ పాత్రలో కనిపించడం ఇష్టం లేక నో చెప్పాడట. ఆ తర్వాత ఈ సినిమా వరుణ్ తేజ్ చేతిలోకి వెళ్లి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా రామ్ చేసి ఉంటేఆయన కెరీర్ కు మంచి ప్లస్ పాయింట్ అయేది అంటారు కొందరు. మరి స్కందతో డిజాస్టర్ ను సొంతం చేసుకున్న రామ్.. డబుల్ ఇస్మార్ట్ తో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.