Allu Arjun: అల్లు అర్జున్ తమిళంలో ఎలా మాట్లాడాడో తెలుసా? చూస్తే తట్టుకోలేరు?

Allu Arjun: అల్లు అర్జున్.. ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. హిందీ వరకూ వెళ్లకపోయినా దక్షిణాది భాషల్లో ఈ సినిమాను ప్రస్తుతానికైతే విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించిన ‘పుష్ప’ టీం ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రమోషన్ మొదలుపెట్టింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చైన్నైలో […]

Written By: NARESH, Updated On : December 14, 2021 3:30 pm
Follow us on

Allu Arjun: అల్లు అర్జున్.. ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. హిందీ వరకూ వెళ్లకపోయినా దక్షిణాది భాషల్లో ఈ సినిమాను ప్రస్తుతానికైతే విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించిన ‘పుష్ప’ టీం ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.

allu arjun respond about lathi charge issue on his fans

ఇప్పుడు తెలుగులోనే కాదు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రమోషన్ మొదలుపెట్టింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చైన్నైలో వాలిపోయాడు. అక్కడ ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా తమిళ మీడియాకు తన పుష్ప మూవీ సంగతులపై ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే మన ‘ఆర్ఆర్ఆర్’ హీరోల్లా ఎక్కడికెళ్లినా అయితే ఇంగ్లీష్, తెలుగు మాట్లాడకుండా సంప్రదాయ తమిళంలో అల్లు అర్జున్ మాట్లాడి అలరించాడు.

అల్లు అర్జున్ తమిళం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నాడని తెలిసి అక్కడి మీడియా జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. బన్నీ తమిళం ఎంతో చూడముచ్చటగా.. అచ్చం తెలుగులానే మాట్లాడడం విశేషం.

Also Read: సిల్వర్‌స్క్రీన్‌పై కొడుకుల‌తో సీనియ‌ర్ హీరోలు.. వెరీ స్పెషల్ మూవీస్

ఇప్పటికే మలయాళంలో మార్కెట్ సంపాదించుకున్న బన్నీ ఆ భాషను పూర్తిగా నేర్చుకున్నాడు. కేరళ వెళితే మలయాళంలోనే మాట్లాడుతారు. ఇక తమిళంలో కూడా ఇప్పుడు అంతే స్పష్టంగా మాట్లాడాడు. దీన్ని బట్టి బన్నీ తమిళం కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. సినిమాల్లోనే సిన్సియారిటీ కాదు..ఆయా భాషలను కూడా అంతే పట్టుదలతో నేర్చుకున్న అల్లు అర్జున్ ను నిజంగానే ప్యాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ ‘పుష్ప’ తమిళ ఇంటర్వ్యూ

Also Read: ఆ స్థానంలో ఫిక్స్ అయిన మహేష్.. మిగతా ప్లేసులే మారుతున్నాయి?