Heart Diseases: ప్రస్తుత కాలంలో మనిషి ఆయుర్దాయం తగ్గుతోంది. పూర్వం రోజుల్లో వందేళ్లు బతికినా వారికి ఎలాంటి రోగాలు ఉండేవి కావు. ఇప్పుడు పాతికేళ్లకే గుండెజబ్బులు వస్తున్నాయి. దీంతో మనిషి ఎన్నేళ్లు బతుకుతాడనే దానిపై స్పష్టత లేదు. దాదాపు నూటయాభై ఏళ్లు బతికే మన గుండెను మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నాం. మనం తినే ఆహారాలతోనే గుండెకు ముప్పు ఏర్పడుతోంది. మన శరీర అవయవాల్లో నిరంతరం పనిచేసేది గుండె ఒక్కటే. దానికి విశ్రాంతి లేదు. నిరంతరం పనిచేయాల్సిందే. అది పనిచేయడం మానేసిందంటే మన ప్రాణాలు పోవాల్సిందే. ఇలా గుండెకు మనిషికి ఎంతో సంబంధం ఉంటుంది. దీంతో దాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. మన వంటింట్లో లభించే ఆహారాలతోనే మనకు ఎన్నో లాభాలున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లితో మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లిని రోజు తీసుకోవడం వల్ల అందులో ఉండే అలిసిన్ అనే పధార్థం నోట్లోని లాలాజలంతో కలిసి అలినిన్ గా మారి లివర్ లోకి వెళ్లి గుండెకు కీడు చేసే ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ తయారవకుండా చేస్తుంది. దీంతో గుండె జబ్బు ముప్పు రాకుండా నిరోధిస్తుంది.
పసుపు కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఏవైనా గాయాలైతే పసుపు రాసుకుంటాం. దీంతో రక్తం కారడం ఆగుతుంది. గాయం కూడా తొందరగా మానుతుంది. పసుపులో కూడా ఎన్నో మంచి గుణాలు దాగి ఉన్నాయి. వంటల్లో వాడే పసుపులో కూడా కరక్యూమిన్ అనే సమ్మేళననం ఉండటం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయే ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ని కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇలా పసుపు కూడా మన గుండెకు ఎంతో మేలు చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు.

దాల్చిన చెక్కకు కూడా ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంటుంది. దీన్ని తగిన మోతాదులో తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇందులో ఉండే ాలిినాల్స్, సినానోసిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది. రక్తనాళాలపై ఒత్తిడి తగ్గించేందుకు సహకరిస్తుంది. గుండెకు రక్తసరఫరా సక్రమంగా జరిగేందుకు దోహదపడుతుంది. గుండె జబ్బు ముప్పు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బు ప్రమాదం నుంచి బయట పడాలంటే పైన చెప్పిన వాటిని తీసుకుని గుండెను పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం అందరికి ఉంటోంది.