Perni Nani: చేప్పేవన్నీ శ్రీరంగ నీతులు,,,చేసేవన్నీ సా..పనులు అన్నట్టుంది మాజీ మంత్రి పేర్ని నాని మాటలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరిగా మాటల మాంత్రికుడినని భావిస్తున్నట్టున్నారు. తాను ఏది చెప్పినా బాగా చెబుతానని జబ్బలు చరుచుకుంటున్నారు. తనకు తాను జగన్ కుటుంబానికి పెద్ద పాలేరుగా అభివర్ణించుకునే నాని మరింతగా దిగజారుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన పవన్ ను అడ్డగాడిదగా సంభోదించారు. మంత్రి పదవి తీసేసినా.. కాపులు, కాపు నాయకులను కించపరుస్తూ జగన్ అభిమానం ఉంటే చాలునన్నట్టు పేర్ని నాని వ్యవహరిస్తున్నారు. ఆయన వాడుతున్న భాష, మాటలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. కామెంట్స్ శృతి మించుతున్నాయి. కేవలం కాపులు, కాపు నాయకులకే తిట్టడానికే తాను ఉన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. టీవీల్లో, సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ చూస్తున్న వారి ఏహ్యభావం కలుగుతోంది. రాజకీయాల గురించి ఇంతలా దిగజారిపోవాలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సాధారణంగా అందరికీ కులాభిమానం ఉంటుంది. అందునా ఒక రెస్పాన్స్ బుల్ పర్సన్ అయినప్పుడు కులాభిమానంపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తన కులంపై ప్రత్యేక అభిమానం చూపుతూనే.. ఎదుటి కులాలను గౌరవించాలి. అయితే ఇప్పుడు పేర్ని నాని విషయానికి వచ్చేసరికి ఇది రివర్స్. తమ అధినేత అభిమానాన్ని చూరగొనడానికి సొంత సామాజికవర్గాన్ని తిడతారు. సొంత కుల నాయకులపై తిట్ల దండకానికి దిగుతారు. తానుకాపునని చెబుతూనే జగన్ పెద్ద పాలేరుగా తనకు తాను అభివర్ణించుకుంటారు. అప్పుడెప్పుడో మంత్రి పదవి చేతిలో ఉంది కనుక.. దానికి కొనసాగింపు కోరుకుంటున్నారు కనుక అలా మాట్లాడి ఉంటారని అంతా భావించారు. కానీ మంత్రి పోస్టు ఊడిపోయినా.. కాపులు, కాపు నాయకులను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కనీసం తోటి వైసీపీ కాపు నాయకులు కూడా వాడని భాషలో మాట్లాడుతున్నారు.

వారం వారం సీఎం జగన్ ను తిట్టడానికే ఒ అడ్డ గాడిద బయటకు వస్తుందని పవన్ గురించి కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఆయనకు అసలు సీఎం అయ్యే అర్హత లేదంటూ తేల్చేశారు. అసలు కాపుల్లోనే సీఎం స్థాయి క్యాండిడేట్ లేరని తన స్టైల్ లో వ్యంగ్యంగా చెప్పేశారు. కాపు జాతికి తానొక్కడినే ప్రతినిధినన్న రేంజ్ లో కులాన్నే జగన్ కు తాకట్టు పెట్టేసినట్టు మాట్లాడేశారు. నిజమే కాపులకు కేవలం మంత్రులకే అర్హత ఉందన్న మాట. అందుకే కాబోలు ఉమనైజ్డ్ పర్సన్ అంబటికి పదవిచ్చారు. రికార్డింగ్ డ్యాన్స్ లు చేసుకునే గుడివాడ అమర్నాథ్ కు కేబినెట్ లో చోటిచ్చారు. వీరికి ఏ అర్హతతో ఇచ్చారు. ఏ సామాజికవర్గం ముసుగులో ఇచ్చారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటు సోషల్ మీడియాలో సైతం పేర్ని నాని కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. జన సైనికులు, కాపు సామాజికవర్గం వారు రియాక్టవుతున్నారు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడేది ఆ నలుగురు. కాపులు, కాపు నాయకులపై మాట్లాడేది మీరా? అంటూ పేర్ని నానిని ఏకిపారేస్తున్నారు. వైసీపీ అధినేతకు ఎంతకు అమ్ముడుపోయావు? కులాన్ని ఎంతకు తాకట్టు పెట్టావంటూ ప్రశ్నిస్తున్నారు.