Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. ఒక సాధారణ మెజీషియన్ బుల్లితెర స్టార్ గా అవతరించి ఆపై హీరోగా ఎదిగాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్… లేటెస్ట్ మూవీ గాలోడు మంచి విజయం సాధించింది. ఈ జబర్దస్త్ కమెడియన్ ని ప్రేక్షకులు వెండితెరపై కూడా ఆదరిస్తారని రుజువైంది. గాలోడు విజయంతో సుడిగాలి సుధీర్ హీరోగా దూసుకుపోవడం ఖాయమని, ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారని టాక్. బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్ అయిన సుధీర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదంటున్నారు. సుధీర్ యాంకర్ గా, కమెడియన్ గా మల్లెమాల కార్యక్రమాల్లో బిజీ కావాలి అనుకుంటున్నారట.

అదేంటీ… ఎవరైనా లైఫ్ లో బెటర్మెంట్ కోరుకుంటారు. ఒక మెట్టు పైకి వెళ్ళాక దిగువ స్థాయికి రావడానికి ఇష్టపడరు. సుధీర్ జబర్దస్త్ వైపు ఎందుకు చూస్తారు? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందేహాలకు కారణం… హైపర్ ఆది సెటైర్స్. సుధీర్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మీతో హైపర్ ఆది ‘మీవాడు కమ్ బ్యాక్ కోసం తెగ బ్రతిమిలాడుతున్నాడటగా’ అని ఘాటైన కౌంటర్ వేశాడు. సుడిగాలి సుధీర్ మల్లెమాల సంస్థలో పని చేస్తానని వేడుకుంటున్నా… యాజమాన్యం ఒప్పుకోవడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చాడు.
గాలోడు మూవీ ప్రమోషన్స్ సమయంలో సుధీర్ త్వరలో జబర్దస్త్ కి తిరిగి వస్తున్నా అన్నారు. మల్లెమాల సంస్థతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. అనుమతి తీసుకొని ప్రోగ్రామ్స్ నుండి విరామం తీసుకున్నాను. ఇటీవల నేను మరలా వస్తానని చెప్పాను. వారు ఓకే అన్నారు. నా మీద కొన్ని కొత్త కామెడీ షోలు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారని, సుధీర్ వివరణ ఇచ్చారు. హీరోగా బిజీ అయినప్పటికీ బుల్లితెరను వదిలేది లేదన్నాడు. సుధీర్ ఈ కామెంట్స్ చేసి నెలలు గడుస్తున్నా ఈటీవీలో ఆయన దర్శనం కాలేదు.
సుధీర్ రాక మల్లెమాలకు మేలు చేసే వ్యవహారమే. ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి అతని కమ్ బ్యాక్ ప్లస్ అవుతుంది. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో సుధీర్ కలిస్తే స్కిట్స్ నవ్వులకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాయి. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ టీమ్ లో పనిచేస్తున్న రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను పూర్తి స్థాయిలో అలరించలేకపోతున్నారు. ఈ ముగ్గురు కలిస్తే ఆ కిక్కే వేరు. కామెడీ ఫ్లోలో వచ్చేస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కి సుడిగాలి సుధీర్ టీమే ప్రాణం. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ టీఆర్పీ కూడా సుధీర్ రాకతో మంచి టీఆర్పీ రాబట్టే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా… రష్మీ-సుధీర్ ల రొమాన్స్ ఇష్టపడేవారికి సుధీర్ వస్తే గుడ్ న్యూస్ అవుతుంది.

సుధీర్ వలన ఇన్ని ప్రయోజనాలు ఉండగా మల్లెమాల ఎందుకు అతన్ని ఆహ్వానించడం లేదనేది అర్థం కాని ప్రశ్న. మల్లెమాల సంస్థ ఒకసారి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళను సంస్థల్లోకి రానివ్వదనే ప్రచారం ఉంది. అయితే నిబంధనలు, ఇగోలు ప్రయోజనాల కంటే ఎక్కువ కాదు కదా. బిజినెస్ ని కూడా కాదని మల్లెమాల వాళ్ళు ఇగోకి పోతారంటే నమ్మలేం. ఇక సుధీర్ కోణంలో ఆలోచిస్తే హీరోగా మంచి కెరీర్ కనబడుతుంటే అతడు యాంకర్, జబర్దస్త్ కమెడియన్ ఎందుకు కావాలని కోరుకుంటున్నాడనేది ఆసక్తికరం. ఈ ఆలోచనలో ఉన్న పాజిటివ్ కోణం ఒక్కటే. సినిమాలు రిస్క్ తో కూడుకున్న గేమ్… ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. యాంకరింగ్ సేవ్ గేమ్… సినిమాల కంటే తక్కువ డబ్బులు వచ్చినప్పటికీ, ప్రతినెలా నికర ఆదాయం ఉంటుంది. ఏది ఏమైనా మల్లెమాల-సుడిగాలి సుధీర్ మధ్య జరుగుతున్న ఈ దోబూచులాట వెనుకున్న అసలు నిజాలు తెలియాల్సి ఉంది.