Viral News: తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా.. ఈ ఉదంతం కూడా అలాంటిదే. కాకపోతే ఈ వ్యవహారంలో ఓ అత్త తన కోడల్ని దోషిని చేద్దామనుకుంది.. కానీ చివరికి తన ఇబ్బందుల్లో పడింది. ఆమె చేసిన పని వల్ల తన కాపురమే కూలిపోయే స్థితిలోకి వెళ్లిపోయింది.. దీనికి సంబంధించి ఆ కోడలు నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల ఒక విదేశీ యువతి ప్రసవించింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన కోడలు, మనవడిని చూసేందుకు ఆ అత్త వెళ్ళింది. మనవడిని చూడగానే ఆమెలో అనుమానం పెరిగిపోయింది. ఎందుకంటే ఆ బాబు కళ్ళు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. దీంతో ఆమెకు తన కోడలు ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందని సందేహం వచ్చింది.. డిఎన్ఏ టెస్ట్ చేయించాలని భావించింది. ఇందులో భాగంగా తన కోడల్ని రోజూ వేధించడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయాన్ని ఆ కోడలు తన భర్తకు చెబితే.. అతడు ఆమెకు మద్దతుగా నిలిచాడు. పైగా తన తల్లిని ఈ విషయంలో తిట్టాడు కూడా. తన భార్య తనను ఎప్పుడూ మోసం చేయదని.. లేనిపోని వివాదాలు సృష్టించొద్దని హితవు పలికాడు. ఆయనప్పటికీ ఆ అత్త పట్టించుకోలేదు. పైగా తన కోడల్ని మరింత వేధించడం మొదలుపెట్టింది. దీంతో తట్టుకోలేక ఆ కోడలు.. తన అత్త చెప్పినట్టే డీఎన్ఏ టెస్టుకు అంగీకరించింది.
ఇలా ఒక రోజు ఆ కోడలు, అత్త కలిసి డిఎన్ఏ టెస్ట్ కి వెళ్లారు. అయితే అక్కడ కథ అనూహ్యమైన మలుపుతీసుకుంది. కోడలు వ్యవహారం వెలుగు చూస్తుందనుకుంటే.. ఆమె అత్త వయసులో ఉన్నప్పుడు చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ డిఎన్ఏ పరీక్షల్లో తన మనవడి తండ్రి తన కొడుకే అయినప్పటికీ.. తన కొడుకుకు తండ్రి మాత్రం తన భర్త కాదని తేలిపోయింది. దీంతో ఆ అత్త ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆమె మనవడి కంటి రంగు.. ఇతర కుటుంబ సభ్యులతో పోల్చితే భిన్నంగా ఉండడానికి కారణం అదే అని తెలిసి.. ఆమె ఒక్కసారిగా నిర్ఘాంత పోయింది.
ఈ విషయాన్ని ఆ కోడలు నెట్టింట పంచుకుంది. తనను అనుమానించిన అత్త.. డిఎన్ఏ టెస్ట్ లో దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని బాధపడింది. ఈ వ్యవహారం ద్వారా తన అసలు తండ్రి ఎవరో కనుక్కునేందుకు తన భర్త తెగ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆ కోడలు వాపోయింది. అయితే ఆ కోడలు పెట్టిన పోస్ట్ చదివిన నెటిజన్లు.. ఆమె అత్తను విమర్శిస్తున్నారు. ఆమె భర్త చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇలాంటి పని చేస్తే కుటుంబం మొత్తం నాశనమవుతుందని.. ఆ విషయాన్ని మర్చిపోవాలని సూచిస్తున్నారు.
I once heard of a grandpa who in the bid to shame his daughter-in-law took his grandson for DNA. The boy wasn’t a match with him. He already started the drama when the lady in question told them to take her son and her husband’s samples for testing. Lo and behold, it was positive
— Àdùkẹ́ Ìbàdàn (@Dammielawlar) April 1, 2024