Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్… సీజన్ 8 వచ్చేస్తుంది!

బిగ్ బాస్ 8 సన్నాహక కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయట. కాగా బిగ్ బాస్ సీజన్ 7 సంచలన విజయం సాధించింది. అత్యధికంగా 21. 7 టీఆర్పీ రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన గొడవలు షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

Written By: S Reddy, Updated On : April 11, 2024 5:26 pm

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ షో అంటే బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అయింది. అపారమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న దానికంటే ముందే ప్రారంభం కానుందని సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 8 కోసం సన్నాహాలు మొదలు పెట్టారని సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపికై కూడా కసరత్తు మొదలైందట.

బిగ్ బాస్ 8 సన్నాహక కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయట. కాగా బిగ్ బాస్ సీజన్ 7 సంచలన విజయం సాధించింది. అత్యధికంగా 21. 7 టీఆర్పీ రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజున జరిగిన గొడవలు షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. బిగ్ బాస్ షో చివరికి హింసకు కూడా దారి తీస్తుంది. ఇటువంటి షో ను బ్యాన్ చేయాలని సాంప్రదాయవాదులు మండిపడ్డారు.

ఎంత కాంట్రవర్సీ నడిచినా బిగ్ బాస్ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. సీజన్ 8 కోసం సిద్ధం అవుతున్నారట. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 జూన్ లేదా జులై లో ప్రారంభం అవుతుందట. ఈ కొత్త సీజన్ ను సరికొత్తగా ప్రేక్షకుల తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గత ఐదు సీజన్స్ మాదిరే హీరో నాగార్జున సీజన్ 8 కి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

సీజన్ 7 ముగిశాక నాగార్జున ఇకపై బిగ్ బాస్ షో హోస్ట్ చేయరు అని .. వేరే హీరోలు ఎవరైనా చేస్తారని రూమర్స్ వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది. నిజానికి గత ఐదేళ్లుగా నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ కి ఆయన బాగా అలవాటు పడ్డారు. అందుకే నాగార్జున సక్సెస్ ఫుల్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. ఇది బిగ్ బాస్ లవర్స్ కి నిజంగా గుడ్ న్యూస్…