Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదో వారంలో ఫ్యామిలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు సండే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ ని స్టేజి పైకి తీసుకొచ్చి మరింత స్పెషల్ గా మార్చేశారు బిగ్ బాస్ టీమ్. ముఖ్యంగా దీపావళి పండుగ కావడంతో ఈనాటి ఎపిసోడ్ 7 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో పండుగ వేళ స్పెషల్ గెస్టులు స్టేజి పైకి వచ్చి సందడి చేశారు.
హోస్ట్ నాగార్జున అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత శ్రీ లీల,వైష్ణవ్ తేజ్ ..ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టేజ్ పై అడుగు పెట్టారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పి .. దీపావళి పండుగ సందర్భంగా హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులతో పాటు వారి స్నేహితులు వస్తున్నట్లు నాగార్జున చెప్పారు. ఇందులో భాగంగా ముందు మానస్ అమర్ దీప్ వాళ్ళ అమ్మ వచ్చారు. తర్వాత గౌతమ్ అన్నయ్య ఇంకా తన ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అర్జున్ స్నేహితుడు, డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చారు.
కాగా హీరోయిన్ ప్రగతి తో పాటు ప్రియాంక వాళ్ళ అమ్మ ఆమె కోసం వచ్చారు. ప్రిన్స్ యావర్ కోసం జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్, యావర్ ఫ్రెండ్ వచ్చారు. కాగా మీరిద్దరూ అసలు ఎలా మాట్లాడుకుంటారు అంటూ నాగార్జున సరదాగా అడిగారు. వాడికి తెలుగు రాదు .. నాకు హిందీ ఇంగ్లీష్ రాదు .. వీడియో కాల్ లో సైగలు చేసుకుంటాం అంటూ కామిడీ చేశాడు. తర్వాత అమర్ తన తల్లితో మాట్లాడాడు. డైరెక్టర్ బుచ్చిబాబు అర్జున్ కి సినిమాలో ఛాన్స్ ఇస్తానని అర్జున్ తో అన్నారు.
ఆ తర్వాత శివాజీ కొడుకు అతని భార్య స్టేజి పైకి వచ్చారు. చిన్న కొడుకుని చూసి శివాజీ మురిసిపోయాడు. రిక్కీ అందరి పై పంచులు వేస్తూ ఆకట్టుకున్నాడు. కాగా శివాజీ భార్య నన్ను చూడవా అని అనడం తో .. ఇంత వరకు నా వైఫ్ గురించి ఎవరికీ తెలియదు సార్ అని శివాజీ చెప్పాడు. అనంతరం మేము ఈ స్థాయిలో ఉన్నామంటే చిరంజీవి, నాగార్జుననే అని శివాజీ వైఫ్ శ్వేత భావోద్వేగానికి గురైంది. ఇక చివరిగా కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చి సందడి చేశారు. ప్రోమో ఎండింగ్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు అని అందరితో నాగార్జున చెప్పించారు.