Divi Vadthya: బోల్డ్నెస్ లో బౌండరీలు దాటేసింది బిగ్ బాస్ దివి. డెనిమ్ షార్ట్, టాప్ ధరించి హాట్ థైస్, టెంప్టింగ్ హిప్ ప్రదర్శించింది. బాలీవుడ్ భామలు కూడా కుళ్ళుకునేలా ఉన్న బాడీ స్ట్రక్చర్ బయటపెట్టింది. దివి జోరు చూసి నెటిజెన్స్ బేజారు అవుతున్నారు. ఈ రేంజ్ గ్లామర్ షోనా అని నోరెళ్ళ బెడుతున్నారు. ఇక దివి తన బోల్డ్ ఫోటోలకు తోడు పోస్ట్ చేసిన కామెంట్ మరింత టెంప్ట్ చేసేలా ఉంది. ‘కేవలం నేను నువ్వు మాత్రమే’ అంటూ రెచ్చగొట్టేలా కామెంట్ పెట్టింది. దివి బోల్డ్ ఫోటో షూట్ సోషల్ మీడియాను వణికిస్తోంది. చలిలో చెమటలు పట్టిస్తుంది.

దివి ఫిగర్ చూశాక… ఆమె గ్లామర్ కి తగ్గ పాత్రలు రావడం లేదనిపిస్తుంది. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెపై ఫోకస్ పెడితే బెటర్. తక్కువ రెమ్యూనరేషన్ లో ముంబై అమ్మాయిలకు మించిన గ్లామరస్ బ్యూటీ దొరుకుతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు… కోట్లు కుమ్మరించి మనవాళ్లు డైలాగ్స్ కూడా రాని మహారాష్ట్ర, బెంగుళూరు, కేరళ భామల వెనుకబడుతున్నారు.
కాగా బిగ్ బాస్ సీజన్ 4లో దివి పాల్గొన్నారు. అయితే ఆమె అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇతర కంటెస్టెంట్స్ మాదిరి దివి గ్లామర్ షో జోలికి పోలేదు. అలాగే అఫైర్స్ గట్రా పెట్టుకోలేదు. దీంతో తక్కువ రోజుల్లోనే ఎలిమినేటై బయటకు వచ్చేశారు. కనీసం ఫైనల్ కి చేరుకున్నా దివి భారీగా ఫేమ్ రాబట్టింది. ఆమెకు అవకాశాలు పెరిగాయి. దివి అనే ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

క్యాబ్ స్టోరీస్, మా ఊరి నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్లలో దివి నటించారు. దివి నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీలో దివి ఓ కీలక రోల్ చేశారు. కథలో ప్రాధాన్యం ఉన్న హీరో చిన్నప్పటి మూగ ఫ్రెండ్ గా దివి నటించారు. అయితే మూవీ విజయం సాధించలేదు. చిరంజీవి హీరోగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీలో నటించారు. 2019లో విడుదలైన మహేష్ సూపర్ హిట్ మూవీ మహర్షిలో కాలేజ్ స్టూడెంట్ రోల్ చేశారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందని… హీరోయిన్ గా నిలదొక్కుకుంటానని ఆమె ఆశపడుతున్నారు. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే ఎటిఎం అనే తో ఓ వెబ్ సిరీస్ ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది.