Homeట్రెండింగ్ న్యూస్Conjunctivitis: ఈ సమయంలో జనం కళ్ళకు నువ్వు కావాలి

Conjunctivitis: ఈ సమయంలో జనం కళ్ళకు నువ్వు కావాలి

Conjunctivitis: కాలం మారుతున్న కొద్దీ ఎప్పుడు ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా దాడి చేస్తుందో తెలియడం లేదు. మొన్నటిదాకా కోవిడ్ వైరస్ తో జనం ఇబ్బంది పడ్డారు. అంతకు ముందు సార్స్, మరి కొన్ని రకాల వైరస్ లతో మనుషులు అతలకుతులమయ్యారు. ఈ విపత్కర పరిస్థితిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది ఇంకా కోలుకొనే లేదు. ఆ కోవిడ్ కాలంలో మూతికి మాస్క్ లేకుండా జనం బయటికి వెళ్లలేదు.కోవిడ్ ముగిసిపోయింది అనుకుంటున్న క్రమంలో మరో రకమైన అంటువ్యాధి జనాలను ఇబ్బంది పెడుతోంది. కళ్లకు జోడు ను పెట్టుకుంటేనే బయటకు వెళ్లే పరిస్థితి కల్పిస్తోంది.

ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాల వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల మనుషుల ఆరోగ్యాల్లో కూడా మార్పులు ఏర్పడుతున్నాయి.. సాధారణంగా వర్షాకాలంలో జలుబులు, జ్వరాలు సర్వసాధారణం. కానీ ఈసారి జ్వరాలతో పాటు కళ్ళ కలక వ్యాధి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీనిని వైద్య పరిభాషలో పింక్ ఐ అని పిలుస్తారు. అపరిశుభ్రమైన వాతావరణం, కాలుష్యం, వంటి కారణాల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధికి బ్యాక్టీరియా ప్రధాన కారణం. ఒకరి నుంచి ఒకరికి సులభంగా సోకుతుంది. ఈ వ్యాధి వల్ల కళ్ళు ఎర్రగా మారుతాయి. అదే పనిగా నీళ్లు కారుతాయి. కళ్ళు విపరీతంగా దురద పెడతాయి. కనురెప్పలు వాచి ఇబ్బంది పెడతాయి. కొన్ని కొన్ని సార్లు ఈ వ్యాధి రోజులపాటు ఉంటుంది. శుభ్రమైన వస్త్రాన్ని నీటిలో తడిపి కళ్ళను తుడుచుకోవాలి. ఐస్ ముక్కలతో కళ్ళకు అప్లయ్ చేయాలి.

సోషల్ మీడియా విపరీతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో కలకల గురించి కూడా మీమ్స్ రూపొందిస్తున్నారు. కొంతమంది క్రియేటర్లు కళ్ళ కలకలకు వేపాకాయ్ మందు వేసుకోవాలని వ్యంగ్యంగా చెబుతున్నారు. వకీల్ సబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ను కోర్టు నుంచి బహిష్కరించినప్పుడు.. శరత్ బాబు ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు నీ అవసరం జనాలకు బాగా ఉంది అంటే హితవు పలుకుతాడు. ఆ సందర్భాన్ని ప్రస్తుతం కళ్ళ కలక వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో క్రియేటర్లు తమకు అనువుగా వాడుకున్నారు. శరత్ బాబు మాట్లాడుతున్న మాటలను వేపకాయ్ మందు కు అన్వయించి ఒక వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. సోషల్ మీడియా పెరిగిపోయిన ఈ రోజుల్లో డిజిటల్ క్రియేటర్లు తమకు నచ్చిన విధంగా వీడియోలను రూపొందించి.. జనాలను ఆకట్టుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version