Gukesh: వేసే ప్రతి అడుగు గమనిస్తూ, గెలుపు, ఓటమిని అంచనా వేస్తూ, తన కదలికలతో పాటు ప్రత్యర్థి కదలికలను కూడా గమనిస్తూ, తన మెదడుకు పదును పెట్టి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కత్తి మీద నడకలా కదిలే ఆట చేస్. సింపుల్ గా చెప్పాలి అంటే చెస్ ఆడడం నాలుగైదు అష్టావధానాలు ఒకేసారి చేయడంతో సమానం. మరి అలాంటి ఆటలో తన ప్రతిభను కనబరుస్తూ దూసుకు వెళ్తున్నాడు 17 ఏళ్ల యువకుడు. తన సత్తాతో మహామహులకు సైతం చెమటలు పట్టిస్తూ వరుస విజయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న గుకేష్, ఇప్పుడు చెస్ దిగ్గజం ఆనంద్ ను సైతం అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
చెన్నైకు చెందిన ఈ 17 ఏళ్ల యువ చెస్ ప్లేయర్ 2755.9 లైవ్ రేటింగ్ సాధించి టాప్ టెన్ లిస్ట్ లోకి అడుగుపెట్టాడు. దీనితో పాటుగా అతని మొట్టమొదటిసారిగా ఆనంద్ రేటింగ్ను ప్రాస్ చేశాడు. అయితే ఇది తొలిసారి జరిగిన విషయమైతే కాదు. 2016లో పి హరికృష్ణ ఆనంద్ లైవ్ రేటింగ్ ని అధిగమించాడు కానీ ఆ తర్వాత స్కోర్ ను నిలబెట్టుకోలేకపోయాడు. అధిగమించడం కంటే కూడా చెస్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎంతో ముఖ్యం. మరి ఈ నేపథ్యంలో గుకేష్ పరిస్థితి ముందు ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమనే చెప్పాలి.
ప్రపంచ చదరంగం లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి గ్రాండ్ మాస్టర్ గా మొదటిసారి నిలిచిన తొలి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్. 1991లో ఎలైట్ స్థాయికి చేరుకున్న ఆనంద్ ఆ పొజిషన్ దక్కించుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ స్థాయికి చేరడానికి గారీ కాస్పరోవ్,అనటోలీ కప్రోవ్ సమక్షంలో రెజియో ఎమిలియా టోర్నమెంట్ గెలిచాడు. అయితే గుకేష్ జాతీయ టైటిల్‌ను ఇంకా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇక కన్సిస్టెన్సీ విషయానికి వస్తే ఆనంద్ కు ఉన్న కన్సిస్టెన్సీ ఆ తర్వాత ఆటగాళ్లలో లేదు అని చెప్పవచ్చు.
ఇదే విషయంపై ఏడుసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన ప్రవీణ్ థీప్సే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.గుకేష్ సాధించింది ఎంతో అద్భుతమైన విజయం. ఇంత త్వరగా అతను ఇంత సక్సెస్ఫుల్ అవుతాడు అని ఎవరు ఊహించలేదు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇదే రకంగా అతను తన విజయ పరంపరను కొనసాగిస్తాడా లేదా అనే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. ఇక ఆనంద్ విషయానికి వస్తే 1991 నుంచి 2016 వరకు అతను మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ఎప్పుడూ టాప్ 15 లోనే ఉండేవాడు.
1978 ప్రాంతంలో 2600 లైవ్ స్కోర్ సాధించిన చెస్ ప్లేయర్స్ 12 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదు. ఒకరకంగా చూస్తే ప్రస్తుతం సాధిస్తున్నటువంటి 2740,2750 స్కోర్స్ అనేవి 1970 – 78 మధ్య ప్రాంతంలో 2600 తో సమానమని చెప్పవచ్చు. అంతెందుకు ఇప్పుడు ఆడే ఆటగాళ్ల స్కోర్ తో పోలిస్తే
ఫిషర్, స్పాస్కీ, బోట్విన్నిక్, పెట్రోసియన్, తాల్, కార్పోవ్ లాంటి వాళ్ళ స్కోర్స్ ప్రస్తుతం తక్కువగా కనిపించవచ్చు. కానీ అప్పట్లో వారి ప్రదర్శన బెస్ట్ అన్న విషయం మనం కాదు అనలేం కదా. కాబట్టి ప్లేయర్స్ మధ్య పోలిక అనేది స్కోర్ తో కాదు కన్సిస్టెన్సీ తో ఉంటే అప్పుడు వారి ఆట సత్తా ఏంటి అనేది తెలుస్తుంది.
అంతేకాకుండా ప్రస్తుతం గుకేష్ ఎలైట్ టోర్నమెంట్ గెలిచే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడా లేదా అనే విషయం కూడా ఆలోచించాలి. ప్రస్తుతానికి కుదరకపోయినా ఇలాగే సాధన చేసి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా గెలుచుకోవచ్చు. ఒకప్పుడు చెస్ ఆడే ప్లేయర్స్ యొక్క మెదడు ఎంతో పదునుగా ఉండేది, అయితే ప్రస్తుతం కంప్యూటర్లతో జరుగుతున్న శిక్షణ వల్ల వాళ్ళలోని క్రియేటివిటీ మందగిస్తోంది. 2020 ఫిబ్రవరి తరువాత ఆనంద్ కేవలం 21 మ్యాచ్లు ఆడినప్పటికీ తన లైవ్ స్కోర్ 2755 ను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మరోపక్క ఈ సమయంలో గుకేష్ సుమారు 350 క్లాసికల్ గేమ్స్ ఆడి ఒక వారం క్రితమే 2750 లైవ్ స్కోర్ సాధించి అప్పటివరకు ఉన్నటువంటి మాగ్నస్ కార్లసన్ రికార్డును అధిగమించాడు. సరైన పంధాలో దూసుకుపోతే ఇతను మరొక విశ్వనాధ్ ఆనంద్ అయ్యే అవకాశం ఉంది.