Telangana Congress: టీకాంగ్రెస్‌లో సంక్షోభం ముదురుతోంది. విభేదాలు సమసిపోయేలా అధిష్టానం తమ దూతగా దిగ్విజయ్ సింగ్‌ను పంపినా సమస్య పరిష్కారం కాలేదు. తామే అసలైన కాంగ్రెస్ వాదులుగా చెప్పుకుంటున్న తొమ్మిది మది.. అధిష్టానం ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. తాజాగా బుధవారం కీలక సమావేశానికీ డుమ్మా కొట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే స్వయంగా సమావేశానికి వెళ్లాలని సూచించినా లెక్కలేయలేదు.

కమిటీల నియామకంతో లొల్లి..
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. ఇందులో కీలక పదవులు టీడీపీ నుంచి రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరిన వారికే దక్కాయి. దీనిపై కొండా సురేఖ మొదట అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత సీనియర్లు రంగంలోకి దిగారు. టీపీసీసీపై తిరుగుబాటు చేశారు. దీంతో అధిష్టానమే రగంలోకి దిగింది. సీనియర్లతో మాట్లాడేందుకు డిగ్గీరాజాను హైదరాబాద్‌కు పంపింది. ఆయన వచ్చి రెండు రోజులు సుమారు 150 మందితో సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాలు పాటించాలని సూచించారు. కానీ వివాదం సమసిపోలేదు. ఈ క్రమంలో సీనియర్లపై వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది.
కీలక సమావేశానికి గైర్హాజరు..
తాజాగా టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతోపాటు 26 నుంచి ప్రారంభించే హాత్‌సే హాత్ జోడో, ఎన్నికల నిధుల సమీకరణ, పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయం తదితర అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని జాతీయ అధ్యక్షుడ మల్లికార్జునఖర్గే స్వయంగా సీనియర్లకు సూచించారు. మిగతా విషయాలన్నీ త్వరలోనే సర్దుకుంటాయని తెలిపారు. ఈమేరకు సీనియర్లకు ఫోన్ చేశవారు. కానీ సమావేశానికి సీననియర్లు డుమ్మా కొట్టారు.

టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన సమావేశం…
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, కోదండరెడ్డి మాత్రమే హాజరయ్యాయరు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా గౌర్హాజరయ్యారు. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడి ఆదేశాలనూ సీనియర్లు లెక్క చేయలేదు. దీంతో వీరిపై వేటు తప్పదన్న అభిప్రపాయం వ్యక్తమవుతోంది.