MLAs Poaching Case: ఒకసారి పులిమీద స్వారీ మొదలుపెట్టాక దిగితే బాగోదు.. ఆ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు.. ఆ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే బీజేపీతో ఫైట్ ను ఆపొద్దని డిసైడ్ అయ్యారు. అందుకే బీజేపీని వేటాడాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను సింగిల్‌బెంచ్ జడ్జి రద్దు చేశారు. కేసును సీబీఐకి అప్పగించారు. అయితతే తుది తీర్పు కాపీ అందే వరకు తీర్పు అమలు చేయొద్దని ప్రభుత్వం న్యాయమూర్తిని కోరింది. దీనికి న్యాయమూర్తి కూడా అంగీకరించారు.

కాపీ వచ్చిన వారం తర్వాత..
తుది తీర్పు కాపీ వచ్చిన వారం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సింగిల్‌బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని డిసైడ్ అయింది. తీర్పుపై న్యాయ నిపుణులతో సుదీర్ఘ మంతనాలు జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదట అప్పీల్‌కు వెళ్లే విషయంలో డైలమాలో పడ్డారు. కానీ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదులు ఇచ్చిన సూచనతో అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వమే అప్పీల్‌కు వెళ్లింది.
సీబీఐకి అప్పగించేందుకు 20 కారణాలు
సిట్‌ను రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించడానికి సింగిల్‌బెంచ్ జడ్జి 20కిపైగా కారణాలు చూపారు. ఆశామాషీగా కాకుండా పటిష్టంగా తుది తీర్పు ఇచ్చారు. ఇందులో గతంలో సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. దర్యాప్తుకు సిట్‌కు ఉన్న అర్హతను ప్రశ్నించారు. ఆధారాలు బయటకు రావడాన్ని తప్పు పట్టారు. సీఎం చేతికి వెళ్లడంపై అసంతృప్తి వ్యక్త చేశారు. దీంతో ప్రభుత్వం మొదల అప్పీల్‌పై పునరాలోచనలో పడింది. కానీ, ఎక్కడో కేసీఆర్‌కు భరోసా దొరికినట్ల కనిపిస్తోంది. సీబీఐ రంగంలోకి దిగుతుందని ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కేసీఆర్.. సీబీఐనే ప్రశ్నిస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇక్కడ కూడా సింగిల్ బెంచ్ తీర్పు వస్తే సుప్రీంకు కూడా వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
స్టే ఇవ్వకుంటే రంగంలోకి సీబీఐ..
ఇదిలా ఉంటే ప్రభుత్వం అప్పీల్‌పై ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వడం. మరొకటి.. స్టే ఇవ్వకుండానే విచారణ జరుపడం. స్టే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సత్వవ ఊరట లభిస్తుంది. అలా కానిపక్షంలో సీబీఐ రంగంలోకి దిగడం ఖాయం. తర్వాత అది కేసీఆర్‌నూ వెంటాడే అవకాశం ఉంది. సీఎం కూడా విచారణ కు హాజరు కావాల్సి రావొచ్చు.

మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు విసయంలో తగ్గేదేలే అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. బీజేపీ పెద్దలను ఇందులోకి లాగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరి డివిజన్ బెంచ్ తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాలి.