Actress Prema- Trivikram: హీరోయిన్ ప్రేమ డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. త్రివిక్రమ్ దారుణంగా మోసం చేశాడని, అతన్ని నమ్మి కెరీర్ నాశనం చేసుకున్నానని ఆమె చెప్పడం ప్రకంపనలు రేపుతోంది. ‘చిరునవ్వుతో’ మూవీ కారణంగా తన కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యిందన్నారు ప్రేమ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ మాట్లాడుతూ… చిరునవ్వుతో సినిమా త్రివిక్రమ్ పై నమ్మకంతో చేశాను. ఈ మూవీలో ఇంకో హీరోయిన్ ఉంటుందా అని అడిగితే… లేదు ఈ మూవీలో మీరే హీరోయిన్. కథ మీ చుట్టే తిరుగుతుంది. కథలో కీలకం మీ పాత్రే అని చెప్పారు.

తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే నాది సపోర్టింగ్ రోల్. త్రివిక్రమ్ మాటలు నమ్మి సినిమా చేసినందుకు నా కెరీర్ నాశనమైంది. చిరునవ్వుతో మూవీ తర్వాత నాకు అలాంటి పాత్రలే వచ్చాయి. హీరోయిన్ గా అప్పుడే ఎదుగుతున్న నా కెరీర్ దెబ్బతిందని ప్రేమ వెల్లడించారు. చిరునవ్వుతో మూవీలో ప్రేమ ప్రేమికుడి చేతిలో మోసపోయిన హీరో మరదలు పాత్ర చేసింది. షాహిన్ హీరోయిన్. హీరో వేణుతో రొమాన్స్, పాటలు షాహిన్ పాత్రకు ఉంటాయి. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ కథ అందించింది త్రివిక్రమే.
బహుశా స్క్రిప్ట్ త్రివిక్రమ్ నేరేట్ చేసి ప్రేమను ఒప్పించి ఉంటారు. దీంతో చిరునవ్వుతో చిత్రానికి రైటర్ గా పనిచేసిన త్రివిక్రమ్ పై ప్రేమ ఆరోపణలు చేశారు. నిజంగా ఈ సినిమా తర్వాత ప్రేమకు హీరోయిన్ అవకాశాలు రాలేదు. ‘ప్రేమతో రా’ మూవీ హీరోయిన్ సిమ్రాన్ అక్క పాత్ర చేశారు. దేవి పుత్రుడు మూవీలో దేవత గా క్యామియో రోల్ చేశారు. తెలుగులో ప్రేమ సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం కావాల్సి వచ్చింది.

ప్రేమ తెలుగులో నటించిన చివరి తెలుగు హిట్ మూవీ ఢీ. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్రీహరి భార్య పాత్ర చేశారు. ధర్మక్షేత్రం మూవీతో టాలీవుడ్ కి ప్రేమ పరిచమయ్యారు. కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి ఆమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇక ఉపేంద్ర మూవీలో ప్రేమ బోల్డ్ రోల్ చేశారు. కన్నడ మూవీ ఉపేంద్ర తెలుగులో సైతం సంచలన విజయం సాధించింది. ఆ మూవీలో ప్రేమ కూడా ఒక హీరోయిన్.