
Director Puri Jagannadh: టాలీవుడ్ లో ఎంతో మంది మాస్ డైరెక్టర్స్ ఉండొచ్చు..కానీ అందరూ పూరి జగన్నాథ్ లు అవ్వలేరు.ఒకేమూస లో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమా స్థితిగతులను మార్చేసిన బ్రిలియంట్ మాస్ డైరెక్టర్ ఆయన.హీరోయిజం కి సరికొత్త నిర్వచనం నేర్పించిన ఆయన గత కొంతకాలంగా తన రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ తగలక, నిర్మాణ రంగం లోకి కూడా అడుగుపెట్టి ఆర్థికంగా కూడా బాగా దెబ్బ తిన్నాడు.
ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయినా పూరి జగన్నాథ్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ ని హీరో గా పెట్టి లైగర్ అనే సినిమా తీసాడు.ఈ చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరించాడు.పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించి భారీ బడ్జెట్ కూడా పెట్టాడు..కానీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో అటు డైరెక్టర్ గా , ఇటు నిర్మాతగా బాగా దెబ్బతిన్నాడు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉన్నా, ఒకప్పుడు మాత్రం ఆయన రేంజ్ ని అందుకోవడానికి దర్శక ధీరుడు రాజమౌళి కి కూడా సాధ్యపడేది కాదు,స్టార్ హీరోలతో సరిసమానమైన మాస్ ఇమేజి ఉండేది.ఈ స్థాయి కి రావడానికి పూరి జగన్నాథ్ ఆ రోజుల్లో చాలా కష్టాలే పడ్డాడు.ఆయన తన భార్య లావణ్య ని సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే పెళ్లి చేసుకున్నాడు.ప్రేమ పెళ్లి కావడం తో ఇంట్లో చెప్పకుండా లేచి వచ్చేసారు.

చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, ఆ సమయం లో ఆయనకీ ప్రముఖ యాంకర్ ఝాన్సీ తాళి బొట్టు కొని ఇచ్చిందట,ఇక నటి హేమ లావణ్య కి పెళ్లి బట్టలు పెట్టడం, పెళ్ళికి వచ్చిన అతిధులకు కూల్ డ్రింక్స్ వంటివి ఇవ్వడం లాంటివి చేసిందట.అలా ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడ దాకా వచ్చిన పూరి జగన్నాథ్, ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో చిక్కుకోవడం ఆయన అభిమానులను బాధపెడుతున్న విషయం.త్వరలోనే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అందరం ఆశిద్దాము.