Ram Charan- Vasishta: సినీ ఇండస్ట్రీ లోనే కాదు..ఏ ఇండస్ట్రీ లో అయినా టాప్ స్థానానికి చేరుకోవాలంటే క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలి..నేడు టాప్ స్టార్ డైరెక్టర్స్ గా, టాప్ స్టార్ హీరోలు గా కొనసాగుతున్న వాళ్ళందరూ ‘ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి’ అనే తత్త్వం తో ఉంటారు..ఉదాహరణకి దర్శక ధీరుడు రాజమౌళి ని తీసుకుందాం..మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసి తెలుగు వాడి సత్తా ఏమిటో చూపించిన దర్శకుడు ఆయన.

అంత ఘనత సాధించినా కూడా ఏరోజు అతను లిమిట్స్ దాటలేదు..సినిమాల్లో పనిచేసే చిన్న జూనియర్ ఆర్టిస్టుని కూడా గౌరవిస్తాడు ఆయన..కాని కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు..ఒక్క హిట్ పడగానే కళ్ళు నెత్తిమీదకి ఎక్కుతాయి..అలాంటి డైరెక్టర్స్ లో ఒకడిగా చేరిపోయాడు భింబిసారా మూవీ డైరెక్టర్ వసిష్ఠ..ఇతగాడు ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటాడు..ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియా అన్న తర్వాత అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం సర్వసాధారణం.
మరీ ముఖ్యంగా మాస్ హీరోలైన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి..అయితే ఇప్పటి వరుకు వీళ్ళ మధ్యలోకి ఏ సెలబ్రిటీ కూడా దూరలేదు..ఒక్క వసిష్ఠ తప్ప..ఇక అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ దవడ మీద కామెంట్ చేస్తూ ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టాడు..ఆ ట్వీట్ ని సమర్థిస్తూ డైరెక్టర్ వసిష్ఠ లైక్ చేసాడు..ఎదో పొరపాటున చేసి ఉంటాడులే అని అందరూ అనుకున్నారు..కాని అతను ఉద్దేశపూర్వకంగానే అలా చేసాడని తర్వాత అర్థం అయ్యింది.

రామ్ చరణ్ ఫ్యాన్స్ తనని తిడుతూ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నా కూడా అతను లైక్ చేసిన ఆ అసభ్యకరమైన ట్వీట్ ని ‘అన్ లైక్’ చెయ్యలేదు..దీనిపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ పై చెలరేగిపోయారు..కనిపిస్తే చితకబాదే రేంజ్ లో వాళ్ళ ఆవేశం ఉన్నింది..ఒక డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో టాప్ రేంజ్ కి వెళ్ళాలి అంటే అందరిని కలుపుకుంటూ పోవాలి..గెలుక్కుంటూ కాదు అని నెటిజెన్స్ వసిష్ఠ పై కామెంట్ చేస్తున్నారు.