Avatar 2 Leaked Online: సోషల్ మీడియా సినిమా ఇండస్ట్రీకి వరమా శాపమా అనే విషయం ఇప్పటికి అర్థం కాదు..పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.., అన్నీ నష్టాలు కూడా ఉంటాయి..ముఖ్యంగా సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్, టెలిగ్రామ్ ద్వారా విడుదలకు ముందే కొన్ని సినిమాలు HD క్వాలిటీ తో విడుదల అయిపోతున్నాయి..ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్ 2 చిత్రం నిన్న టెలిగ్రామ్ లో దర్శనమిచ్చింది.

అది కూడా HD క్వాలిటీ తో..ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ ని పలు ప్రాంతాలలో వేశారు..మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఆ ప్రీమియర్ షోస్ నిర్వహించడం వల్ల పైరసీ కి గురైంది అవతార్ 2 చిత్రం..వేల కోట్ల ఖర్చు చేసి సుమారుగా 12 ఏళ్ళ పాటు శ్రమించి జేమ్స్ కెమరూన్ తీసిన ఈ వెండితెర అద్భుతం ఇలా విడుదలకు ముందే టెలిగ్రామ్ లో లీక్ అయిపోవడం అత్యంత బాధాకరం.
దీని ప్రభావం అవతార్ 2 మీద కచ్చితంగా పడుతుంది.. ఎందుకంటే అసలే ఓటీటీ కాలం ఇది.. ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి మూడు గంటల సినిమా చూడాలంటే అదనంగా మరో గంట కేటాయించాలి..అంటే మొత్తం నాలుగు గంటలు అన్నమాట..అంత ఓపిక ఇప్పుడు ఆడియన్స్ కి ఓటీటీ పుణ్యమా అని వచ్చింది.. కానీ అవతార్ 2 వంటి చిత్రాలు వెండితెర అద్భుతాలతో సమానం..థియేటర్ లో 70 ఏంఏం స్క్రీన్ మరియు ఐమాక్స్ స్క్రీన్స్ మీద , డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో చూస్తే వచ్చే అనుభూతి మన ఇంట్లో చూస్తే ఏమొస్తుంది.

పైగా ఈ చిత్రాన్ని 3Dలో చూస్తే మనం పండోర గ్రహంలోకి అడుగుపెట్టి అక్కడ నివసిస్తున్న వాళ్ళతో కలిసి మూడు గంటలపాటు ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతుంది.. అలాంటి అనుభూతి ని పైరసీ ద్వారా విడుదలైన ప్రింట్ ని చూసి మిస్ అవ్వొద్దు..కనీవినీ ఎరుగని థియేట్రికల్ అనుభూతి పొందడానికి థియేటర్స్ లోనే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యండి.