Director Koratala Siva: డైరెక్టర్ కొరటాల శివ ప్రెస్ మీట్..’ఆచార్య’ ఫలితం పై సంచలన నిజాలు బయటపెట్టనున్నాడా?

Director Koratala Siva: ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న #NTR30 మూవీ ఈరోజే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. #RRR చిత్రం తర్వాత సుమారుగా ఏడాది పాటు ఖాళీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మొత్తానికి సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రేపే ముహూర్తం ప్రారంభించి, రేపే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారని టాక్. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. […]

Written By: Vicky, Updated On : March 23, 2023 7:30 am
Follow us on

Director Koratala Siva

Director Koratala Siva: ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న #NTR30 మూవీ ఈరోజే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. #RRR చిత్రం తర్వాత సుమారుగా ఏడాది పాటు ఖాళీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మొత్తానికి సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. రేపే ముహూర్తం ప్రారంభించి, రేపే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారని టాక్. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు.

యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఆచార్య చిత్రం కొరటాల కెరీర్ లో ఒక మాయని మచ్చ లాంటి చిత్రం.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రం ఫలితానికి కారణం కొరటాల శివ మాత్రమే అని పలు సందర్భాలలో పరోక్షంగా చురకలు అంటించాడు. అయితే రేపు #NTR30 ప్రారంభం అవుతున్న సందర్భంగా కొరటాల శివ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయబోతున్నాడట. ఈ ప్రెస్ మీట్ లో కచ్చితంగా ఆచార్య కి సంబంధించి ఆయన కామెంట్లు చేసే అవకాశం ఉంది.

Director Koratala Siva

ఇప్పటి వరకు ఆచార్య చిత్రం ఫలితం పై నోరు మెదపని కొరటాల శివ, రేపు తన నోటికి పని చెప్పబోతున్నాడా, మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తాడా, లేదా కేవలం ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమా గురించి మాత్రమే మాట్లాడి వెనుతిరుగుతాడా అనేది ఇప్పుడు ఉత్కంఠకి గురి చేసే విషయం. ఏమి జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.