https://oktelugu.com/

DJ Tillu Sequel: ‘DJ టిల్లు’ సీక్వెల్ షూటింగ్ అప్పుడే అయిపోయిందా..విడుదల తేదీ కూడా ఫిక్స్

DJ Tillu Sequel: గత ఏడాది విడుదలైన సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రాలలో ఒకటి ‘DJ టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించింది. కేవలం 6 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అంటే పెట్టిన డబ్బులకు మూడు రెట్లు లాభం […]

Written By:
  • Vicky
  • , Updated On : March 23, 2023 / 07:40 AM IST
    Follow us on

    DJ Tillu Sequel

    DJ Tillu Sequel: గత ఏడాది విడుదలైన సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రాలలో ఒకటి ‘DJ టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించింది. కేవలం 6 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అంటే పెట్టిన డబ్బులకు మూడు రెట్లు లాభం అన్నమాట, నిర్మాత సూర్య దేవర నాగవంశీకి భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రం ఇది.

    అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని సిద్దు అప్పట్లోనే ప్రకటించాడు, గత ఏడాదే షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది,హీరోయిన్ మార్పిడి విషయం లో ప్రేక్షకులను బాగా తికమక పెట్టిన మూవీ టీం, చివరకు అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అన్నట్టు ఉన్న ఈ సినిమా అప్పుడే చివరి దశకు చేరుకుందట.

    అంతే కాదు విడుదల తేదీ కూడా ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాని జూన్ 22 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్స్ , పాటలు మరియు ప్రోమోలు వంటివి వచ్చే నెల నుండి ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నారట.

    DJ Tillu Sequel

    ఇది ఇలా ఉండగా DJ టిల్లు అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం హీరో కామెడీ టైమింగ్ మరియు డైలాగ్స్. కాబట్టి అలాంటి సినిమాకి సీక్వెల్ అయ్యినందున ఈ చిత్రానికి టీజర్ దగ్గర నుండి , పాటల వరకు ప్రతీ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. వాటిని అందుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు, కత్తి మీద సాము లాంటిది. మరి డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.