Digital Media: కొత్త ఒక చింత, పాత ఒక రోత.. ఈ సామెత అన్నింటికీ వర్తిస్తుంది. ఇప్పుడు మీడియాకు కొంచెం ఆలస్యంగా వర్తించింది.. మునుముందు ఎలాంటి పోకడలు పోతుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే కొత్తదారి వెంట పయనిస్తోంది . ఇక పూర్వకాలం నుంచి స్మార్ట్ ఫోన్లు వచ్చేదాకా ముద్రణ మాధ్యమానిదే హవా.. ప్రస్తుత మీడియా హౌస్ ల్లో టాప్ పొజిషన్లో ఉన్న వారంతా కూడా ప్రింట్ మీడియా నుంచి వచ్చినవారే. కాలనుగుణంగా మార్పులు రావడం, ఎలక్ట్రానిక్ మీడియా చొచ్చుకు రావడంతో ప్రింట్ మీడియాకు ప్రాధాన్యం తగ్గిపోయింది.. మరీ ముఖ్యంగా కోవిడ్ కాలంలో ఆ ప్రభావం మరింత ఎక్కువైంది.. ఇక దీనికి తోడు పత్రికలన్నీ ఏదో ఒక పార్టీకి డప్పు కొడుతుండడం, యాజమాన్యాల పొలిటికల్ రాతలతో జనాల్లో ఏవగింపు మొదలైంది.. ఫలితంగా ప్రింట్ మీడియా పరిస్థితి దిగజారిపోయింది.

డిజిటల్ మీడియా హవా
కోవిడ్ కాలంలో పెద్ద పెద్ద మీడియా హౌస్ లు ఉద్యోగులను తొలగించాయి. చాలామంది నడిరోడ్డు మీద పడ్డారు.. అప్పటిదాకా వారితో పని చేయించుకున్న యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ఉద్వాసన పలికాయి.. ఇలాంటి వారికి డిజిటల్ మీడియా అండగా నిలిచింది.. ఇలాంటి డీజిటల్ మీడియాలో మొదట ఆ విప్లవానికి దారి తీసింది “దిశ”.. నమస్తే తెలంగాణ మాజీ న్యూస్ నెట్ వర్క్ ఇంచార్జి మార్కండేయ, రామ్మోహన్ రావు తో కలిసి దీనిని ప్రారంభించారు. ఇది అనతి కాలంలోనే విశేషమైన ఆదరణ చూరగొన్నది. అంతేకాదు భవిష్యత్తు డిజిటల్ మీడియా అని చాటిచెప్పింది. చాలామంది మాజీ జర్నలిస్టులకు ఉపాధి చూపింది.. ఇక దిశ ఇచ్చిన ఉత్సాహంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ముద్ర అనే డిజిటల్ పేపర్ ను ప్రారంభించారు.. ఇది కూడా సేమ్ దిశ మాదిరే ఉంటుంది.. ఇందులో కూడా ఉద్యోగాలు కోల్పోయిన సీనియర్ జర్నలిస్టులకు ప్రాధాన్యమించారు.

అదే బాటలో వెలుగు
ఇక మాజీ ఎంపీ వివేక్ సారధ్యంలో ఐదు సంవత్సరాల క్రితం వెలుగు అనే ఒక పేపర్ ప్రారంభమైంది.. మొదట్లో బాగానే నడిచినా… తర్వాత ఎందుకనో ఆ ఊపు కొనసాగించలేకపోయింది. పైగా ప్రింట్ మీడియా ఖర్చులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో యాజమాన్యం పొదుపు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పేజీలకు కత్తెర వేసింది. పైగా ప్రింట్ మీడియాకు స్వస్తి పలికి మొత్తం డిజిటల్ రూపంలో కి మారింది.. ఇప్పుడున్న నెట్వర్క్ ను ఉపయోగించుకొని వృద్ధిలోకి రావాలని భావిస్తోంది.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.. ఉద్యోగులకు యాజమాన్యం నుంచి లేఖలు కూడా అందాయి. ప్రస్తుతం వెలుగు యాజమాన్యం తీసుకొన్న నిర్ణయం జర్నలిజం వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.. అంతేకాదు భవిష్యత్తు మొత్తం డిజిటల్ మీడియాతో అని చాటి చెబుతోంది.
-ఓ పత్రిక డిజిటల్ మారుతూ పంపిన సర్క్యూలర్ వైరల్ కాపీ
