మానవ మృగాలపై డీఐజీ సుమతి సంచలన పోస్ట్..?

కాలం ఎంత మారినా మనుషుల్లో, మనుషుల ఆలోచనా తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లల పట్ల మగాళ్లు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్న ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా మనుషుల ఆలోచనా తీరులో మార్పు రాకపోతే ఎవరూ ఏం చేయలేరు. ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన మహిళా ఐపీఎస్, డిఐజీ సుమతి పెట్టిన పోస్ట్ […]

Written By: Navya, Updated On : October 3, 2020 6:10 pm
Follow us on

కాలం ఎంత మారినా మనుషుల్లో, మనుషుల ఆలోచనా తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లల పట్ల మగాళ్లు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్న ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎంతమంది ఎన్ని పోరాటాలు చేసినా మనుషుల ఆలోచనా తీరులో మార్పు రాకపోతే ఎవరూ ఏం చేయలేరు.

ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన మహిళా ఐపీఎస్, డిఐజీ సుమతి పెట్టిన పోస్ట్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఫేస్ బుక్ వేదికగా ఆమె వ్యక్తం చేసిన ఆవేదన అందరినీ కదిలిస్తోంది. ప్రజల్లో మార్పు వస్తే మాత్రమే దేశంలో అఘాయిత్యాలు చోటు చేసుకోకుండా ఆపడం సాధ్యం అవుతుందని సుమతి తెలిపారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ పురుషులు మహిళల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలిసేలా చేస్తోంది.

దేశంపై నల్లని మరకలు పడుతున్నాయని.. సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని సుమతి చేసిన పోస్ట్ ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆడపిల్లల విషయంలో కన్న తండ్రి సైతం కసాయివాడిగా మారుతున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. కామాంధుల ఆలోచనా తీరు ఎంత దారుణంగా ఉంటుందో తన పోస్ట్ ద్వారా సుమతి తెలిపింది.

అనుబంధాలు ఆదమరిచి నిద్రపోతున్నాయని.. వాంఛ తీర్చి తృప్తి పడదామంటూ సుమతి సమాజంపై మృగాల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించింది. మహాత్మగాంధీ ప్రార్థనలతో అంటూ సుమతి ఈ పోస్ట్ ను ముగించారు. బాధితులకు తెలిసిన వాళ్లే ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. సమాజానికి అవగాహన కల్పించే విధంగా ఉండే సుమతి పోస్టులు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.