https://oktelugu.com/

Died after taking Viagra : శృంగారం కోసం వయాగ్రా వాడాడు.. చనిపోయాడు.. అదే కొంప ముంచింది

Died after taking Viagra  : అతి సర్వత్రా వర్జయేత్.. అని ఆ కుర్రాడు తెలుసుకునే ప్రాణాలు కోల్పోయాడు. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు, ప్రియురాలిని సుఖ పెట్టేందుకు అతడు తీసుకున్న నిర్ణయం అతడి జీవితాన్నే కబలించింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహితురాలితో ఏకాంతంగా గడిపేక్రమంలో ఓ వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏకంగా రెండు 50 ఎంజీ వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. అది కూడా పూటుగా మద్యం సేవించిన స్థితిలో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2023 10:04 pm
    Follow us on

    Died after taking Viagra  : అతి సర్వత్రా వర్జయేత్.. అని ఆ కుర్రాడు తెలుసుకునే ప్రాణాలు కోల్పోయాడు. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు, ప్రియురాలిని సుఖ పెట్టేందుకు అతడు తీసుకున్న నిర్ణయం అతడి జీవితాన్నే కబలించింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    స్నేహితురాలితో ఏకాంతంగా గడిపేక్రమంలో ఓ వ్యక్తి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఏకంగా రెండు 50 ఎంజీ వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. అది కూడా పూటుగా మద్యం సేవించిన స్థితిలో వేసుకున్నాడు.ఈ నిర్లక్ష్యమే అతడి నిండు ప్రాణాలు తీసింది. తొలుత వాంతులై, అనంతరం మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన అజయ్‌ పార్టెకీ! ఈ ఘటనను ‘ఫోరెన్సిక్‌ అండ్‌ లీగల్‌ మెడిసిన్‌’ అనే మాసపత్రిక మార్చి సంచికలో ప్రచురించింది. అందులోని కథనం ప్రకారం..

    నాగపూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్‌ గదిలో అజయ్‌ తన స్నేహితురాలితో కలిసి దిగాడు. సాయంత్రం ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం అజయ్‌ వయాగ్రా బ్రాండ్‌ నేమ్‌తో కూడిన ‘సిల్డెన్‌ఫిల్‌’ మాత్రలు రెండింటిని వేసుకున్నాడు. ఉదయం నిద్రలేచాక తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కొద్దిసేపటికి వాంతులు చేసుకోవడంతో ఆందోళనకు గురైన స్నేహితురాలు, ఆస్పత్రికి వెళ్దామని అతడిని తొందరపెట్టింది. అతడేమో తేలిగ్గా తీసుకున్నాడు. ఇలా తనకు గతంలోనూ జరిగిందన్నాడు. కొద్దిసేపటికే అజయ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచాడు. మద్యంతో వయాగ్రా మాత్రలు వేసుకోవడం, దీనికి అతడి హై బీపీ సమస్య తోడవడంతోనే మృతిచెందాడని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అజయ్‌ తరహాలోనే వైద్యుల సూచనలు తీసుకోకుండా వయాగ్రా వాడటం దేశంలో బాగా పెరిగిపోయిందని నిపుణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. వయాగ్రాతో తలనొప్పి, కడుపునొప్పి, రక్తపోటు లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయన్నారు. మరోవైపు గతంలో కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఓ 60 ఏళ్ల వృద్ధుడు.. ఓ వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రోద్బలంతో అతిగా వయాగ్రా మాత్రలు వేసుకొని ప్రాణాలు విడిచాడు.